కృష్ణ వంశీ క‌థ‌పై డేట్ రావ‌డ‌మే ఆల‌స్యం

350

కుటుంబ క‌థా చిత్రాలు తీయ‌డంలో డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ మార్క్ వేరు.. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి… ఆయ‌న సినిమాల్లో న‌లుగురు బంధువులు, కుటుంబాలు విలువ‌లు అన్నీ మిళిత‌మై ఉంటాయి.. అందుకే ఆయ‌న సినిమాలు కుటుంబ క‌ధా చిత్రాలు అని అంటారు.. తాజాగా ఇప్పుడు ఆ కుటుంబ క‌ధా చిత్రాల‌కు గ్యాప్ ఇచ్చారు అని కృష్ణ‌వంశీ గురించి టాలీవుడ్ లో చ‌ర్చ జ‌రుగుతంది.. దీనికి కార‌ణం ఆయ‌న కొద్ది రోజులుగా తెర‌కెక్కించిన సినిమాలు అంత హిట్ టాక్ తెచ్చుకోక‌పోవ‌డం కార‌ణం అని అంటున్నారు…

Image result for krishna vamsiఅయితే ఆయ‌న మ‌ళ్లీ త‌న స‌క్సెస్ ను ట్రాక్ లోకి తీసుకువ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది… కొత్త వాళ్ల తో కొత్త క‌థ‌తో సినిమా చేయాలి అని ఆయ‌న తాజాగా డెసిష‌న్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న కొత్త ర‌కం న‌టీ న‌టుల‌తో సినిమా చేయాల్సిన స్క్పిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు అని తెలుస్తోంది.. ఈ సినిమాతో మ‌ళ్లీ కృష్ణవంశీ గ‌త సినిమాల స‌ర‌స‌న కొత్త సినిమాని నిల‌బెడతాడేమో అని చూస్తున్నారు ఆయ‌న అభిమానులు… మ‌రి కృష్ణ‌వంశీ మార్క్ ఈ కొత్త చిత్రంలో చూపిస్తారో లేదో చూద్దాం ..ఎందుకు అంటే కృష్ణ‌వంశీ అంటే ఫ్యామిలీ సినిమాల దర్శ‌కుడు అనే మార్క్ ఎప్ప‌టికీ అలానే ఉంటుంది.