ఎన్టీఆర్‌ అవార్డుకు సెలెక్ట్ అయిన డైరెక్టర్ క్రిష్‌

220

ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ పేరిట ఏర్పాటు చేసిన లెజెండరీ ఎన్టీఆర్‌ అవార్డును సినీదర్శకుడు క్రిష్‌కు అందజేయనున్నారు. కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిఏటా రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. 2018 అవార్డును ఈనెల 30న జరిగే సభలో క్రిష్‌కు ప్రదానం చేయనున్నారు.

Related image

క్రిష్‌ 2008లో గమ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు.ఆ తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీ పుత్ర శాతకర్ణి, కంచె లాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు.హిందీలో గబ్బర్‌సింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ చిత్రం మంచి సక్సెస్‌ సాధించింది. ఝూన్సీరాణి చరిత్రను మణికర్ణిక పేరుతో హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను కూడా ఈయనే తీస్తున్నాడు.

Image result for director krish

తీసిన ప్రతి సినిమాకు ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, నంది అవార్డులు, బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు అందుకున్న ఆయన దర్శక ప్రతిభను గుర్తించి కళా పరిషత్‌ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 30న జరిగే సభలో క్రిష్ కి ప్రధానం చేయనున్నారు.