విజయ్ దేవరకొండ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా..

310

కొరటాల శివ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓటమన్నదే ఎరుగని అగ్ర దర్శకుడు. చేసిన నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్. రికార్డ్స్ కలెక్షన్స్ మూవీస్. ప్రతి చిత్రంలోనూ సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ.. సందేశం ఇవ్వడం ఈ దర్శకుడి స్టైల్. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ లాంటి వరుస హిట్ చిత్రాలను రూపొందించి క్రేజీ దర్శకుడిగా మారారు కొరటాల.

Related image

ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు తహతహలాడుతున్నారు.అయితే కొరటాల శివ మాత్రం ఒక యాంగ్ హీరోతో సినిమా చెయ్యడానికి సిద్దమయ్యాడు.కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవితో తెరకెక్కించనున్నారు. కొరటాల, చిరంజీవి కోసం ఇంట్రస్టింగ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశాడట.

Related image

ఈ సినిమా తరువాత కొరటాల శివ విజయ్‌ దేవరకొండతో చెయ్యనున్నాడంట.కథ సిద్ధం చేస్తున్నాడంట.త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు కూడా ఫైనల్‌ కానుందన్న టాక్‌ వినిపిస్తోంది.ఇదే నిజమైతే విజయ్ దేవాకొండకు ఇండస్ట్రీ హిట్ పక్కా..