టాలీవుడ్ లో మరో ఘోరం…ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరిచూపుకు తరలివస్తున్న సినీ ప్రముఖులు

885

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న శ్రీకాంత శర్మ.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1944 మే 29న జన్మించారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి 20 ఏళ్ల పాటు సేవలందించారు. మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మొదట జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు. పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు శ్రీకాంత్ శర్మ రచించారు.

Image result for ఇంద్రగంటి మోహనకృష్ణ

అనేక లలిత గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలను రచించారు. అలాగే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఉప సంపాదకుడిగా, ‘ఆంధ్రప్రభ’ పత్రికకు సంపాదకుడిగా చాలాకాలం పనిచేశారు. పలు తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఆయన పాటను రచించారు. సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ సినిమాలో ‘మనసైనదేదో వరించిందిలా…’ అనే పాటను ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ’ విరచించారు..

ఈ క్రింద వీడియోని చూడండి

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పలు సినిమాలకు పాటలు కూడా రాశారు. కృష్ణావతారం, నెలవంక, రెండు జళ్ల సీత, పుత్తడిబొమ్మ లాంటి సినిమాల్లో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కొడుకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమాలో ‘మనసైనదేదో’ అనే రొమాంటిక్‌ సాంగ్‌ ఆయన రాసిన చివరి పాట. శ్రీకాంత్ శర్మ 1966లో సుప్రసిద్ధ కథారచయిత్రి జానకీబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. కుమార్తె కిరణ్మయి కూడా డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఈమె మోహనకృష్ణ కంటే పెద్దవారు. కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది. మంచి మనిషిగా, సాహితీ వేత్తగా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ కొడుకు ఇంద్రగంటి మోహనకృష్ణకు ధైర్యం చెబుతున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రస్తుతం నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లతో ‘V’ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు.

కాగా, శ్రీకాంత్ శర్మ మృతికి సంతాపం తెలుపుతూ హీరో నాని ట్వీట్ చేశారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక మేధావి అని, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అష్టా చమ్మా’ సినిమాను చూసిన తరవాత మోహన్ గారితో పాటు తామందరనీ చూసి ఆయన ఎంత గర్వపడ్డారో ఇప్పటికీ మరిచిపోలేనని అన్నారు. మోహనకృష్ణ గారికి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, హీరో సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకథ ఇంటిపేరు ఇంద్రగంటి పాఠకాదరణ పొందింది. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోని స్వర్గధామ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తండ్రిగారైన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ మృతిపై మీ సంతాపాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి..