Breaking News:టాలీవుడ్ లో విషాదం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృతి.

241

సీని ఇండ‌స్ట్రీలో నీలి నీడ‌లు అల‌ముకున్నాయి.. ఇటీవ‌ల సినిమా రంగానికి చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు వ‌రుస‌గా ఈ లోకం విడిచివెళ్లిపోవ‌డం బాధ‌ని క‌లిగిస్తోంది.. ఇప్ప‌టికే ఇలా ఇండ‌స్ట్రీలో దాస‌రి నారాయ‌ణ రావు, శ్రీదేవి, ప్ర‌ముఖ నటీమ‌ణులు ఈ లోకం విడిచివెళ్లారు.. తాజాగా ఓ పెద్ద ద‌ర్శ‌కుడు మ‌ర‌ణ వార్త సినీ ఇండ‌స్ట్రీని కోలుకోలేని విధంగా చేసింది అని చెప్పాలి… ఇప్ప‌టికే హ‌రికృష్ణ మ‌ర‌ణావార్త‌ని జీర్ణించుకోలేని తెలుగు ఇండ‌స్ట్రీ ఇక తాజాగా సందేశాత్మ‌క చిత్రాల‌తో అల‌రించిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి మ‌ర‌ణ వార్త విని కంగుతింది.

Image result for కేఎన్‌టీ శాస్త్రి

సందేశాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్టీ శాస్త్రి కన్నుమూశారు. తిలదానం – సురభీ, షాను వంటి చిత్రాలకు నంది అవార్డులను అందుకున్న కేఎన్‌టీ శాస్త్రి.. పలు చలన చిత్రోత్సవాలకు జ్యూరీ సభ్యుడిగా కూడా పనిచేశారు.2006లో నందితా దాస్‌ హీరోయిన్‌గా ఆయన తెరకెక్కించిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. సినీ విమర్శకుడిగా శాస్త్రి పలు పుస్తకాలు కూడా రాశారు. దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన ఏడు జాతీయ అవార్డులు, 12 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.

Image result for కేఎన్‌టీ శాస్త్రి

ఇక తెలుగుచ‌లన చిత్రరంగంలో త‌న‌కంటూ ఓ స్టేచ‌ర్ ఏర్ప‌ర‌చుకున్నారు. ఆయ‌న రాసిన పుస్త‌కాలు కూడా ఎంద‌రినో ఆక‌ట్టుకున్నాయి. ఇక పెద్ద పెద్ద ద‌ర్శకులు నిర్మాత‌ల‌తో ఆయ‌నకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి, విమ‌ర్శ‌లు లేని వ్య‌క్తిగా ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయ‌న సినిమాల‌కు ఇప్ప‌టికీ అభిమానులు ఉన్నాయి. ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ కాకుండా సందేశాలు ఇచ్చేలా సినిమాలు తీసేవారు.తెలుగులో ఆయ‌న సినిమాల‌కు మూడు నంది అవార్డులు వ‌చ్చాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా త‌క్కువ సినిమాలు చేసినా ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్ధానం సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌న సంపాదించుకున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతిక‌ల‌గాల‌ని ఆయ‌నకు నివాళులు అర్పిస్తున్నారు సినీ పెద్ద‌లు, మీరు కూడా ఆద‌ర్శ‌కుడికి నివాళులు అర్పించి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.