ద‌ర్శకురాలు బి జ‌య గుండెపోటుతో క‌న్నుమూత‌

453

ప్రముఖ జర్నలిస్టు, మహిళా దర్శకురాలు బి జయ కన్నుమూశారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజుకి ఆమె సతీమణి. బీ జయ మృతితో పాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బీ జయ మృతి పట్ల పలువురు సీనీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

famous tollywood director b jaya died with heart attack

 

చలన చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. బి జయ 1964, జనవరి 11న జన్మించారు. ఆమెకు 54 సంవత్సరాలు. చెన్నై యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. జర్నలిజంలో డిప్లోమా పూర్తి చేశారు. అలాగే అన్నామలై నుంచి సైకాలజీలో పీజీ విద్యను అభ్యసించారు.

మహిళా దర్శకుల్లో అత్యుత్తమ

ఉన్నత విద్య పూర్తయిన వెంటనే బీ జయ తెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. చిత్రజ్యోతికి రిపోర్టర్‌గా ఆమె పాత్రికేయ జీవితాన్ని ఆరంభించారు.2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా మారారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ తర్వాత 2005లో ప్రేమికులు, 2007లో గుండమ్మ గారి మనవడు, 2008లో సవాల్, 2012లో లవ్లీ, 2017లో వైశాఖం చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రస్తుత తరం మహిళా దర్శకుల్లో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా గొప్ప పేరును సంపాదించుకొన్నారు. పలు చిత్రాలకు ఉత్తమ దర్శకురాలిగా అవార్డులు, రివార్డులు అందుకొన్నారు.