ద‌ర్శ‌కుడు అన్న మాట‌ల‌పై హ‌ర్ట్ అయిన దిల్ రాజు

404

రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు ఓ మంచి ఫేమ్ ఉంది. ముఖ్యంగా నిర్మాత‌గా టాలీవుడ్ లో ఆయ‌న టాప్ సినిమాలు తీశారు అనే పేరు సాధించుకున్నారు… ఎంద‌రో యంగ్ ద‌ర్శ‌కుల‌కు ఛాన్స్ ఇచ్చారు ఆయ‌న.. ఇక తాజాగా ఆయ‌న నితిన్ హీరోగా రాశిఖ‌న్నా హీరోయిన్ గా శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస క‌ల్యాణం సినిమా నిర్మించారు… ఈసినిమా పై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి పెరిగిపోయింది..

Image result for Srinivasa Kalyanam

నితిన్ రాశి ఖన్నాల మధ్య కెమిస్ట్రీ బాగుటుందని టాక్ రావడంతో, శ్రీనివాస కళ్యాణం కు మంచి బజ్ వచ్చింది అనే చెప్పాలి.. ఇక ఈ చిత్రం ఈ నెల 9న విడుద‌ల కానుంది..కాని ఈ సినిమా విష‌యంలో ఓ చ‌ర్చ బ‌య‌ట జ‌రుగుతోంది.. అది వాస్త‌వం కాదు అని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు

Image result for Srinivasa Kalyanam

శ్రీనివాస కళ్యాణం చిత్రం చిత్రీకరణ కూడా దిల్ రాజే చూసుకుంటున్నారని, ఒక రకంగా ఈ చిత్రం ఆయనకు డెబ్యూ డైరెక్టర్‌గా మొదటి సినిమా అంటూ ఆ మధ్య కొన్ని కథనాలు వచ్చాయట… ఈ వార్త‌లు విని ఆయ‌న బాగా హ‌ర్ట్ అయ్యాను అని తెలియ‌చేశారు.. నేను ద‌ర్శ‌కుల‌ వెన‌కాల ఉంటాను అంతే మిన‌హా ఎప్పుడూ డైరెక్ష‌న్ లో వేలు పెట్ట‌లేదు అని అన్నారు… ఇలాంటి పుకార్లు సృష్టించ‌కండి అని ఆయ‌న తెలియ‌చేశారు.