రాశికన్నాకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు..ఎందుకో చూడండి..

413

తెలుగు ముద్దుగుమ్మ రాశికన్నా వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే.జై లవకుశ,తొలిప్రేమ లాంటి వరుస హిట్స్ కొట్టింది.తాజాగా శ్రీనివాస కల్యాణం చిత్రంతో మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. శ్రీనివాస కల్యాణం చిత్రంలో ఒక మంచి కూతురు పాత్రలో నటించి ఆకట్టుకొన్నారనే విషయం రిలీజ్‌కు ముందే ప్రచారం జరుగుతున్నది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది.

ఈ చిత్రంలో తన పాత్ర ఎమోషనల్‌గా ఉంటుందని, ఆ పాత్రకు కోసం చాలా కష్టపడ్డాను అని రాశీ వెల్లడించారు.శ్రీనివాస కల్యాణం చిత్రంలో శ్రీ అనే పాత్ర కోసం కసరత్తు చేశాను. ఎలాంటి సందేహం వచ్చినా దర్శకుడు సతీష్ వెగేశ్నను అడిగి తెలుసుకొన్నాను.అమలాపురంలో పెళ్లి సన్నివేశాలను తీసేటప్పుడు దిల్ రాజు చాలా కఠినంగా వ్యవహరించాడు. సెట్లో ఉన్నప్పుడు నా చేతిలో మొబైల్ ఫోన్ ఉండవద్దని దిల్ రాజు, దర్శకుడు సతీష్ ముందే హెచ్చరించారు. అయినా ఫోన్‌ చేతిలో ఉంటే నా వద్ద నుంచి మొబైల్‌ను లాగేసుకొన్నారు.

 

సన్నివేశాలు, స్క్రిప్టుపై ఫోకస్ పెట్టమని దిల్ రాజు చెప్పారు. సతీష్ కూడా పాత్రలో లీనమవ్వాలని పలుమార్లు ఎంకరేజ్ చేశారు.దిల్ రాజు, సతీష్ విజన్‌, పడిన కష్టం తెర మీద కనిపించింది. కొన్ని సీన్లు చాలా భావోద్వేగంతో సాగాయి. నా పాత్ర నా నటనను మరోస్థాయికి తీసుకెళ్లేలా రావడానికి వారే కారణం అని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.