రాజ్‌ తరుణ్‌ దర్శకుడిని సెట్ చేసిన దిల్ రాజు… మరి ఈసారైనా హిట్ కొడతారా.

153

ఇండస్ట్రీలో దిల్ ఉన్న రాజుగా దిల్ రాజుకు పేరు ఉంది. చిన్న సినిమాల స్థాయి నుంచి పెద్ద పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఆయన చేరుకున్నాడు. మొన్న సంక్రాంతికి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు. అయితే దిల్‌ రాజు ఇక మీద చిన్న సినిమాలనే ఎక్కువగా నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు ఒక చైనా సినిమా తీసే పనిలో ఉన్నాడు.

Image result for raj tarun dil raju

హీరో రాజ్ తరుణ్ తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. గతేడాది దిల్‌ రాజు నిర్మాతగా.. రాజ్‌ తరుణ్‌ హీరోగా ‘లవర్‌’ సినిమా వచ్చింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్‌ కృష్ణారెడ్డి చెప్పిన కథకు ఇంప్రెస్‌ అయిన దిల్‌ రాజు ఈ మూవీలో హీరోగా రాజ్‌ తరుణ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Image result for raj tarun

‘కుమారి 21ఎఫ్‌’ తరువాత ఆ స్థాయి హిట్‌ కొట్టలేక రాజ్‌తరుణ్‌ వెనుకబడిపోయాడు. ఈ హీరో సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ సినిమాతోనైనా రాజ్‌ తరుణ్‌కు సక్సెస్‌ లభిస్తుందో లేదో చూడాలి.