ఆ టాప్ హీరోయిన్ విజ‌య‌నిర్మ‌ల కూతురని మీకు తెలుసా

3328

తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన నటి, డైరెక్టర్ విజయనిర్మల. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి,ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈమె అతిచిన్న వయస్సులోనే బాలనటిగా చిత్ర రంగం ప్రవేశం చేసి ఎన్నో చిత్రాలలో అలరించింది. నాలుగేళ్ల వయస్సులోనే అంటే 1950లో మత్సరేఖ అనే తమిళ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో రెండు సినిమాల్లో బాలనటిగా చేసింది. 1946 ఫిబ్రవరి 20న మద్రాసులో జన్మించిన ఈమె అసలు పేరు నిర్మల. తమిళంలో 1965లో ‘యంగవీటు పెళ్ళై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ సంస్థ ఈ సినిమా తీయడం,అప్పటికే నిర్మలమ్మ అనే నటి ఉండడం వంటి కారణాల వలన తన పేరును విజయ నిర్మల గా మార్చుకుంది. ఇక అదే ఏడాది తెలుగులో మంచి కుటుంబం అనే సినిమాలో చేసింది. అందులో అక్కినేని హీరోగా చేసారు.

Image result for jayasudha

ఇక ఆనాటి నుంచి హీరోయిన్ గా తన హావా సాగిస్తూ వచ్చిన విజయనిర్మల తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ అయ్యింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్నారు. నిజానికి కృష్ణకు ఈమె రెండో భార్య. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే కావడం విశేషం. విజయ నిర్మల హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా రంగప్రవేశం చేసి మీనా, కవిత, బెజవాడ బెబ్బులి, దేవదాస్, హేమాహేమీలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెతో పాటు మరికొందరిని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది విజయనిర్మల. వారిలో ముఖ్యులు ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ.

ఈ క్రింది వీడియో చూడండి

జయసుధకు, విజయనిర్మల మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసా..ఈ ఇద్దరు తల్లీకూతుళ్లు అవుతారు. ఎలా అంటే విజ‌య‌నిర్మ‌ల జ‌య‌సుధ‌కు పిన్ని అవుతుంది. జయసుధ వాళ్ళ అమ్మ, విజయనిర్మల అక్కాచెల్లెళ్లు అవుతారు. అలా విజయనిర్మల జయసుధకు పిన్ని అవుతుంది. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఇక విజయనిర్మల కుటుంబం నుంచి వచ్చిన మరొక నటుడు నరేష్. ఇతను విజయనిర్మల కొడుకు. ఎన్నో హాస్యభరిత చిత్రాలలో నరేష్ నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. అలాగే ‘మా’ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా ఉన్నారు. ఇలా విజయనిర్మల తన వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. మరి విజయ నిర్మల గురించి ఆమె సినీ కెరీర్, వారసుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.