చంద్రమోహన్ కూతురు పెద్ద స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా? ఆమె ఎవరో తెలిస్తే షాక్

1891

ఒక్కొక్కరు ఎక్కువ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు, కొందరికి కేవలం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే వచ్చేస్తుంది. అలా గుర్తింపు పొందిన నటీనటులను ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తిండిపోతారు. ఒకే ఒక సినిమాలో నటించి అలాంటి గుర్తింపు పొందిన అలనాటి హీరోయిన్ సబిత.విశ్వనాథ్ గారి సినిమా సప్తపది ద్వారా తెలుగుతెర మీద మెరిసిన నటి సబిత.ఈ ఒక్క చిత్రంతో ప్రేక్షకుల మనసులో చిరకాలం ఉండిపోయింది.ఈమె ఆ సినిమాలో తప్ప ఎక్కడ కనిపించదు.అసలు ఆమె సినిమాలు ఎందుకు చెయ్యలేదు.అసలు ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా ఇచ్చింది.ఆమెకు ఎవరైనా చుట్టాలు ఉన్నారా. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for సబిత హీరోయిన్

కళాతపస్వి కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఆణిముత్యం లాంటి సినిమా సప్తపది. అందులో సబిత హీరోయిన్ గా వేసింది. ‘నెమలికి నేర్పిన నడకలివి’ పాటతో ఆంధ్రదేశంలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఈమె క్లాసికల్ డ్యాన్సర్. ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు అద్భుతంగా పోషించి,ఎందరో హీరోయిన్స్ పాలిట సెంటిమెంట్ గా మారిన చంద్రమోహన్ ఈమెకు పెదనాన్న. ఇంతకీ సబిత సినీ ఎంట్రీ ఎలా ఇచ్చింది, మళ్ళీ సినిమాల్లో నటించకుండా ఎందుకు గుడ్ బై చెప్పేసింది వంటి విషయాలలోకి వెళ్తే,ఈమె అసలు పేరు భమిడిపాటి సబిత. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈ తండ్రి ప్రభుత్వోద్యోగి. తల్లి సాధారణ గృహిణి. సబితకు ఓ అక్క కూడా ఉంది.చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఇష్ట పడే ఈమె, చదువుకోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె స్కూల్ లో చదువుతో పాటు భరతనాట్యం లో ప్రావిణ్యం సంపాదించింది. ఇక అప్పట్లో తాను తీయబోయే సప్తపది చిత్రంలో నృత్య పరంగా సాగే హీరోయిన్ పాత్ర కోసం అమ్మాయిలను వెతుకుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆడిషన్స్ నిర్వహిస్తున్న సమయంలో ఓ రోజు సబిత డాన్స్ ప్రోగ్రాం చూసి,నేను తీయబోయే సినిమాలో హీరోయిన్ వేషం వేస్తావా అని అడిగితె ఏంచెప్పాలో తెలియక తల అడ్డంగా ఊపేసి వెళ్లిపోయిందట.ఇక ఆమెను చూసి అర్హ్డం చేసుకున్న విశ్వనాధ్ నేరుగా వాళ్ళింటికి వెళ్లి అమ్మ నాన్నలను సంప్రదించి,వాళ్ళను ఒప్పించి హీరోయిన్ గా సప్తపది మూవీలోకి ఎంపిక చేసుకున్నారు. సప్తపది సినిమా తో సబిత రికార్డు సృష్టించింది. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఛాన్స్ లొచ్చినా,నటించలేదు.పెళ్లి చేసుకున్న ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఇప్పుడు ఆమె జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈమెకు ఒక కొడుకు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ తమ్ముడు కుమార్తె అయిన సబిత హీరోయిన్ గా కంటే క్లాసికల్ డాన్సర్ గానే ఉండడానికి ఇష్టపడింది.అలా సినిమాలకు దూరం అయ్యింది.చేసింది ఒక్క సినిమా అయినా మన అందరిలో ఎప్పటికి గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నటి సబితా గురించి అలాగే ఆమెకు సంబంధించి మేము చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.