తాను చనిపోతానని హరికృష్ణ కు ముందే తెలుసా? కారు ఎక్కుతూ ఎందుకు అలా అన్నారు?

435

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.నిన్న సాయంత్రం అంతక్రియలు ముగిసాయి.అయితే హరికృష్ణ చనిపోతాడని ఆయనకు ముందే తెలుసా..సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది.అయితే ఈ వార్త రావడానికి హరికృష్ణ చెప్పిన కొన్ని మాటలే నిదర్శనం అని అంటున్నారు.మరి హరికృష్ణ ఏం చెప్పాడు.తెలుసుకుందామా.

Image result for harikrishna

హరికృష్ణ చనిపోతాడని ఆయనకు ముందే తెలుసా..హరికృష్ణ స్నేహితుడు చెప్పిన ఒక విషయం గురించి వింటే ఇది నిజమేమో అని అనిపిస్తుంది.ఇంతకు ఆయన చెప్పిన విషయం ఏమిటో తెలుసా..హరికృష్ణ ఒక పెళ్ళికి వెళ్తూ చనిపోయాడని మన అందరికి తెలిసిందే.అయితే ఈ పెళ్లినే కాకుండా హరికృష్ణ మరొక వివాహానికి కూడా హాజరు కావాల్సి ఉంది. హరికృష్ణకు సికింద్రాబాద్‌ లో నివసించే హన్మంతరావు అనే వ్యక్తి వీరాభిమాని.ఒక్క అభిమాని మాత్రమే కాదు మంచి స్నేహితుడు కూడా.గత 38 ఏళ్ల నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది.అయితే సెప్టెంబర్ 2 వ తేదీన హన్మంతరావు కొడుకు పెళ్లి జరగనుంది. అయితే వివాహానికి ఆహ్వానిద్దాం అని హరికృష్ణ ఉండే ఆహ్వానం హోటల్ కు వెళ్ళాడు.

Image result for harikrishna

తనను చూడగానే హన్మంతరావు బాగున్నవా, ఏంటీ ఇలా వచ్చావని అడిగినట్లు ఆయన తెలిపారునా కొడుకు పెళ్లి ఉంది అని చెప్పాను.ఎప్పుడు అని ఆయన అడిగారు.మీ పుట్టిన రోజునాడే అన్నా అని చెప్పాను.అయితే అలా చెప్పిన వెంటనే హరికృష్ణ గారు అన్న మాట విని నా గుండె తరుక్కుమంది.నా పుట్టినరోజునాడా..ఆరోజు వరకు నేను ఉంటానో ఉండనో.. ఒకవేళ ఉంటె తప్పకుండా వస్తాను అని హరికృష్ణ చెప్పినట్టు హన్మంతరావు చెప్పాడు.బోనాల సందర్భంలో మహంకాళీ అమ్మవారి ఆలయానికి హన్మంతరావే తీసుకొచ్చేవారని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

1999లో అన్నా తెలుగుదేశంపార్టీ తరఫున సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి భగ్గు హన్మంతరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి స్వయంగా బీఫారాన్ని అందించడమేగాకుండా ప్రచారానికి సైతం వచ్చారు.అంతేకాదు ఆయన జాతకంలో గ్రహసంచారం బాగాలేదని…దూరప్రయాణం మానుకోమని ఓ సిద్ధాంతి చెప్పారని ఆయన హోటల్ లో సర్వ్ చేసే హోటల్ బాయ్ చెప్పాడు.అయినా ఇవేమి పట్టించుకోకుండా హరికృష్ణ డ్రైవ్ చేసి మనల్ని విడిచి వెళ్ళిపోయాడు.హరికృష్ణ స్నేహితుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే హరికృష్ణ చనిపోతానని ముందే అనిపించిందా..వస్తానో రానో అని హరికృష్ణ ఎందుకు అన్నాడు.హరికృష్ణ మరణం గురించి అలాగే అలాగే ఆయన స్నేహితుడు హన్మంతరావు చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.