మీ వినాయకుడి ముందు డాన్స్ చేసి మాకు పంపండి మీకు గిఫ్ట్ ఇస్తాం అని అంటున్న దేవదాస్ చిత్ర బృందం..

333

టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ ‘దేవదాస్’.రష్మిక మందాన ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న దేవదాస్ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 27న విడుదల చేయాలని యూవీ యూనిట్ భావిస్తోంది.

Image result for devadas

అయితే వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ లిరికల్ సాంగ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ఇప్పుడు మూవీలోని వినాయక చవితి స్పెషల్ సాంగ్ డ్యాన్స్‌తో చాలెంజ్ విసిరింది మూవీ యూనిట్. మేం రెడీ.. మీరు రెడీనా అంటూ వీడియో సాంగ్ ప్రొమోను నాని ట్వీట్ చేశారు. ‘వినాయక చవితి వేడుకల్లో భాగంగా మీరు డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేయండి.

ఆ వీడియోను డ్యాన్స్‌ విత్‌ దేవదాస్ (DanceWithDevadas)కు ట్యాగ్ చెయ్యండి.అలా ట్యాగ్ చేసిన వాళ్లలో కొందరికి దేవదాస్ మూవీ యూనిట్ నుంచి బహుమతులు వస్తాయని’ వైజయంతీ మూవీస్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో నాని ఈ విషయం గురించి తెలియజేశాడు.మేమే చూసి మీకు మంచి గిఫ్ట్ ఇస్తామని నాని తెలిపాడు.