కోడలు సుమ నిజ స్వరూపం బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న దేవదాస్ కనకాల..

1104

యాంకర్ సుమ… పరిచయం అక్కర్లేని పేరు. రాజీవ్ కనకాల భార్యగా, యాంకర్ గా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. సమయస్ఫూర్తి చలాకీతనం మాటకారితనం హుందాతనం.. ఇలా తన యాంకరింగ్ లో అన్ని చూపిస్తుంది. ఇక సుమ మామగారు దేవదాస్ కనకాల గురించి చాలా కొద్దిమందికే తెలుసు. నటుడిగా మొదట్లో కొన్ని చిత్రాలలో నటించిన ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్ ను పెట్టి ఎంతోమంది నటులను వెండితెరకు పరిచయం చేశాడు. రజనీకాంత్ చిరంజీవి రాజేంద్రప్రసాద్ లాంటి పెద్ద పెద్ద నటులు దేవదాస్ కనకాల శిష్యులు. అలంటి దేవదాస్ కనకాల ఒక ఇంటర్యూలో తన జీవితంలో జరిగిన విషయాలను చెప్పుకొచ్చారు.

Image result for suma

తనకన్నా వయసులో 6 ఏళ్ళు పెద్ద అయినా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ గురించి పెళ్లి గురించి జీవితంలో అనుభవించిన ఎన్నో మధుర అనుభూతుల గురించి చెప్తూ తన భార్య ఇప్పుడు తనతో లేదని కన్నీటిపర్యంతం అయ్యారు. తన ప్రతి గెలుపు వెనుక తన భార్య ఉందని చెప్పాడు. తన భార్య మరణించిన తాను చీకట్లో ఉంటుందని అందుకే తన బాధను చీకటికీ చెప్పుకుంటానని,కొడుకు అయినా రాజీవ్ కు కోడలు అయినా సుమకు అస్సలు చెప్పను అని దేవదాస్ కనకాల చెప్పిన సందర్భం చూసి చాలా మంది కళ్ళలో నీళ్లు తిరిగాయి.ముసలితనంలో ఒంటరితనం ఎలా వేదిస్తుందో అర్థం అయ్యింది.అయితే కొడుకు కోడలు సాధిస్తున్న విజయాలు చూస్తే ఆనందం వేస్తుందని తన కోడలిని పొగుడుతుంటే పట్టరాని ఆనందం వేస్తుందని చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

“సుమ ‘మేఘమాల’ సీరియల్ చేస్తున్న సమయంలో రాజీవ్ కనకాల కూడా అందులో ఒక చిన్న వేషం వేశాడు. ఆ అమ్మాయితో కలిసి పనిచేస్తున్నప్పుడు .. అరె .. ఈ పిల్ల చాలా తెలివైనదానిలా వుంది .. ఈ అమ్మాయి కోడలిగా మా ఇంటికి వస్తే ఎలా వుంటుంది? అనిపించింది.రాజీవ్ కనకాల కంటే ముందు సుమ నా దృష్టిలో పడింది. ఆ తరువాత కొంతకాలానికి సుమ ఫోన్ చేసి, తాను .. రాజీవ్ కనకాల ప్రేమించుకున్నామనీ .. పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నామని చెప్పింది. మీరంతా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అంది. ఈ లోగా రాజీవ్ కనకాల .. వాళ్ల అమ్మకి ఈ విషయం చెప్పేశాడు. వాళ్లమ్మకి సుమ ఒక్కతే కూతురు .. ఆమెను ఒప్పించమని అన్నాను. ఆ తరువాత సుమ తరఫున వాళ్లని కూడా ఒప్పించి పెళ్లి జరిపించాము” అని చెప్పుకొచ్చారు. విన్నారుగా కోడలు సుమ గురించి దేవదాస్ కనకాల చెప్పిన విషయాల గురించి. మరి సుమ గురించి దేవదాస్ కనకాల గురించి ఆయన చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.