కెప్టెన్ అయినా తనిష్..ఆనందం పట్టలేక దీప్తి సునైనా ఏం చేసిందో తెలిస్తే షాక్..

654

బిగ్ బాస్‌‌ హౌస్‌శుక్రవారం నాటి (జూలై 20) ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.యాంకర్ ప్రదీప్ ఇంట్లో ఉండే సభ్యులకు వాళ్ళ ఇంట్లో పంపిన మెసేజ్ లు చదివి అందర్నీ ఎమోషన్ కు గురి చేశాడు.ఇక అందరిని ఎమోషన్ గురి చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.అయితే శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఈ వారం కెప్టెన్ కోసం పోటీలు జరిగాయి.మరీ ఈ పోటీల గురించి ఆ తర్వాత జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమాలో భాగంగా ఎక్కువ పారితోషికం అందుకున్న తనీష్, అమిత్, బాబు గోగినేనిలు కెప్టెన్ కోసం పోటీ పడ్డారు. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా కాళ్లతో టమోటో జ్యూస్‌ను తీయాలని.. ఎవరు ఎక్కువ జ్యూస్ తీస్తారో వాళ్లే బిగ్ బాస్ కెప్టెన్ అని టాస్క్ ఇవ్వడంతో తనీష్ అందరికంటే ఎక్కువ జ్యూస్‌ తీసి ఈ వారం కెప్టెన్‌గా అర్హత సాధించారు.బిగ్ బాస్ హౌస్‌కి తనీష్ కెప్టెన్ కావడంతో ఎప్పుడూ అతడ్ని అంటిపెట్టుకుని ఉండే దీప్తి సునైనా ఆనందానికి అవధులు లేవు.గట్టిగా తనిష్ ను హాగ్ చేసుకుని చిన్న ముద్దు ఇచ్చింది. ఆనందంతో గంతులు వేసింది.


తనే కెప్టెన్ అయినంత ఆనందంగా దీప్తి ఫీల్ అయ్యింది.100 వోల్త్స్ బల్బ్ వెలిగినంత తేజస్సు తన మోహంలో కనపడింది.కెప్టెన్ హోదాలో మరింతగా దీప్తి సునైనాకు అతుక్కుపోయి కనిపించారు తనీష్. ఆమె బుగ్గలు గిల్లుతూ తలను నిమురుతూ ఒకే బెడ్‌పై సెటిల్ అయిపోయింది ఈ జంట. తేజస్వి కూడా తనీష్‌తో ఆనందాన్ని పంచుకుంది.ఒకవైపు తనీష్, దీప్తి సునైనా వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ వస్తున్నా నాని చురకలు అంటిస్తున్నా ఈ ప్రేమజంట మాత్రం అస్సలు తగ్గడం లేదు.దూరంగా ఉండటానికి అస్సలు ఇష్టపడడం లేదు.

మరి రేపటి ఎపిసోడ్‌లో ప్రేమ పూజారి, కొత్త కెప్టెన్ తనీష్ ఎలాంటి రొమాంటిక్ సీన్స్ చూపిస్తారో చూడాలి.మరీ ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు.తనిష్ కెప్టెన్ అయినా విషయం మీద దానికి దీప్తి సునైనా ఇచ్చిన రియాక్షన్ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.