బిగ్ బాస్ హౌస్ లో ఒక రేంజ్ లో పిచ్చేక్కించిన దీప్తి సునైనా..చూడకపోతే చాలా మిస్ అవుతారు…

810

నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో రోజుకొక విషయం జరుగుతుంది.ఇంటి సభ్యులకు ఏదో ఒక టాస్క్ ఇవ్వడం జనాలను అట్రాక్ చేయడమే బిగ్ బాస్ పని అయ్యింది.బిగ్ బాస్‌లో రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్,లవ్ ప్రపోజ్ ఇలా నవరసాల్ని పిండేస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకర్నిమించి ఒకరు రెచ్చిపోయి నటించేస్తున్నారు.అయితే హౌస్ లో దీప్తి సునైనా ఐటం సాంగ్ తో రెచ్చిపోయింది.
మరి ఆ విశేషాలు తెలుసుకుందామా…

Image result for deepthi sunaina

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 39కి వచ్చేసరికి రంజుగా మారింది. బిగ్ బాస్ టాస్క్‌లో భాగంగా ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ సినిమాను హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీర లెవల్లో తెరకెక్కిస్తున్నారు. బుధవారం నాటి ఎపిసోడ్ లో ఈవారం లగ్జరీ బడ్జెట్ భాగంగా ‘బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ మూవీ’ అనే ఎనర్జిటిక్ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఓ కథను రెడీ చేసి.. ఆ కథకు అనుగుణంగా క్యారెక్టర్స్‌ని ఎన్నుకుని అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహించి క్యారెక్టర్స్‌ని ఫైనల్ చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్‌గా అమిత్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా దీప్తి, కెమెరామెన్‌గా రోల్ రైడాలను బిగ్ బాస్ నియమించారు. కథ, క్యారెక్టర్స్ ఎంపికలు వీళ్లే నిర్వహించారు..

Related image

ఇక ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ మూవీలో భాగంగా తనీష్, కౌశల్, సామ్రాట్‌లకు మేల్ లీడ్ రోల్ ఇవ్వడంతో పాటు నందిని రాయ్, దీప్తి సునైనాలకు ఫీమేల్ లీడ్ రోల్స్ ఇవ్వడంతో పాత్రల్లో లీనమైపోయారు.ఇక ఐటమ్ సాంగ్‌లో భాగంగా తేజస్వి డాన్స్ ట్రైనింగ్‌లో దీప్తి సునైనా, సామ్రాట్‌లు ఆర్య సినిమాలోని రింగ రింగా సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దీప్తి సునైనా పాటకి తగ్గ క్యాస్ట్యూమ్స్‌ డాన్స్‌తో రచ్చ చేసేసింది.

సాంగ్ లో దీప్తి అందాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు.సామ్రాట్‌ని డానినేట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌ని మాస్ స్టెప్పులతో షేక్ చేసింది. చివర్లో సామ్రాట్ బుగ్గపై ముద్దును కూడా ఇచ్చేసింది దీప్తి.ఇలా సినిమా టాస్క్ కోసం ఐటం గర్ల్ గా ప్రేక్షకులను అలరించింది.మరీ ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు.దీప్తి అందమైన డాన్స్ గురించి అలాగే సినిమా షూటింగ్ లో ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.