గుట్టు చప్పుడు కాకుండా దీపికా, రణ్‌వీర్ సింగ్ పెళ్లి ఏర్పాట్లు..

364

ఈ మద్య బాలీవుడ్ తారలు అందరు పెళ్లి పీటలేక్కుతున్నారు.ఈ మధ్యే అనుష్క శర్మ మరియు సోనం కపూర్ లు పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు వీరి లాగే దీపికా పడుకునే కూడా పెళ్ళికి సిద్దపడింది.బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే పెళ్లిపై ఇటీవల కాలంలో రకరకాల రూమర్లు వస్తున్నాయి.వారికి నిశ్చిత్తార్థం జరిగిపోయింది. ఈ ఏడాది పెళ్లి జరుగుతుంది అనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆ విషయం నిజం కాబోతుంది.వీరి వివాహం ఈ ఏడాది నవంబర్‌లో జరుగుతుంది అనే వార్తను బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి.దీపికా, రణ్‌వీర్ తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారని తెలుస్తున్నది.ఇటలీలో వీరి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.

రణ్‌వీర్, దీపికా పెళ్లి ఇటలీలోని లాంబార్డీలోని లేక్ కోమోలో నవంబర్ 10న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అతిథులకు వసతి, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం అని వారి సన్నిహితులు ధృవీకరించారు. త్వరలోనే అధికారికంగా వెల్లడించడానికి అవకాశం ఉంది. మీడియాకు దూరంగా ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగేలా చర్యలు తీసుకొంటున్నారు.