దీపికా ఇంట్లో పెళ్లి సందడి షురూ.. తొలి పూజ విశేషాలు

274

బాలీవుడు స్టార్లు దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాము వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నట్టు రెండు వారాల క్రితమే వారు ప్రకటించారు. నవంబర్ 14, 15 తేదీల్లో తమ వివాహం జరగనున్నట్టు దీపిక, రణ్‌వీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Image result for deepika padukone pre-wedding-festivitie

 

అయితే వీరి పెళ్లి సందడి అప్పుడే మొదలైపోయింది. శుక్రవారం దీపికా పదుకొనె ఇంట్లో తొలి పూజా కార్యక్రమం జరిగింది. బెంగళూరులోని తన తల్లిదండ్రులు ప్రకాశ్ పదుకొనె, ఉజ్జలతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య దీపికా పదుకొనె తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది.

Image result for deepika padukone

ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు.ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.ఈ ఫొటోల్లో నారింజ రంగు సబ్యసాచి సల్వార్ షూట్‌లో దీపికా పదుకొనె మెరిసిపోతోంది.