డియర్ కామ్రేడ్ ఫోటోలు లీక్.. విజయ్ దేవరకొండ లుక్ సూపర్

204

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.హీరోయిన్ రష్మిక విజయ్ కు జోడిగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం.

కొత్తగూడెంలో షూటింగ్

ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొత్త గూడెంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది..ఓ పాఠశాల ప్రాంతంలో డియర్ కామ్రేడ్ చిత్ర షూటింగ్ జరుగుతుండగా విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున విజయ్ ని చూసేందుకు ఎగబడ్డారు. మరికొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో షూటింగ్ జరగనుంది. పోలీసులు అవసరమైన భద్రతని షూటింగ్ కొరకు ఏర్పాటు చేశారు.

షాకింగ్ లుక్

షూటింగ్ ప్రదేశం నుంచి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ ఫోటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ తో, కాస్త మీసంతో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఖాకీ డ్రెస్సులో కనిపిస్తున్న ఓ ఫోటో మాత్రం అభిమానులు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఖాకి డ్రెస్సులో విజయ్ దేవరకొండ కార్మికుడిగా కనిపిస్తున్నాడు.