ఎన్టీఆర్ బయోపిక్ లో రానా..ఎవరి పాత్రో తెలిస్తే షాక్..!

469

బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది…ఈ సినిమాలో కీలక చంద్రబాబు పాత్ర కోసం రానా ను తీసుకున్నారు..ఈ మేరకు రానాపై టెస్ట్ పూర్తయింది..గడ్డాన్ని కాస్త సరిచేసి, పసుపు రంగు చొక్కా వేసి అచ్చమైన చంద్రబాబులా రానాను ముస్తాబుచేశారు. అంతేకాదు.. చంద్రబాబు గెటప్ లో, ఆయన మేనరిజమ్స్ లో రానా కొన్ని డైలాగ్స్ చెప్పి రిహార్సల్స్ కూడా పూర్తిచేశాడు. చంద్రబాబు నాయుడు పాత్రం కొన్ని రోజులుగా రానా తో సంప్రదించిన క్రిష్ ఎట్టకేలకు అతన్ని ఒప్పించగలిగాడు…

సినిమాలో రానాకు 3 బలమైన సన్నివేశాలున్నాయట. ఎన్టీఆర్-చంద్రబాబు సాన్నిహిత్యాన్ని చూపించడంతో పాటు.. స్వయంగా ఎన్టీఆర్ చంద్రబాబుకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన సన్నివేశాల్ని ఇందులో చూపించబోతున్నారు. రానా ఓకే అనడంతో క్రిష్ కన్ను ఇప్పుడు మహేష్ పై పడింది. సినిమాలో కృష్ణకు సంబంధించిన సన్నివేశం ఒకటుంది. ఆ ఒక్క సన్నివేశం కోసం మహేష్ ను తీసుకురావాలనేది క్రిష్ ప్లాన్. కానీ మహేష్ మాత్రం నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఏఎన్నార్ పాత్ర కోసం నాగార్జున లేదా సుమంత్ లో ఒకర్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. బాలయ్య-నాగ్ కు పడడంలేదు కాబట్టి నాగార్జునను అడిగే సాహసం చేయడు క్రిష్…ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. బాలయ్య, విద్యాబాలన్ పై కొన్ని సన్నివేశాలు తీశారు. నెక్ట్స్ షెడ్యూల్ లో రానా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి.