డాడి సినిమాలోని ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్

928

టాలీవుడ్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ లకు మంచి భవిష్యత్ ఉంటుంది.ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది.చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి స్థానానికి ఎదిగారు.సినీ పరిశ్రమకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది సక్సెస్ కాలేకపోయారు.కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ తరువాత కొంత కాలానికి ఆ హీరో పక్కనే హీరోయిన్ గా స్టెప్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి.అలాంటి వారిలో ముందుగా అతిలోక సుందరి శ్రీదేవి, మీనా, నిత్యా మీనన్, అవికా గోర్ వంటి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ నుంచి హీరోయిన్ గా మారినవారే.ఇప్పుడు ఆ వరుసలోకి మరొక బుల్లి ఆర్టిస్ట్ వస్తుంది.మరి ఆ చిన్నారి ఎవరో ఏ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో చూద్దామా.

Image result for Anushka Malhotra

మెగా స్టార్ చిరంజీవి హీరోగా 2001 లో వచ్చిన హిట్ మూవీ డాడి. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది..డాడి సినిమాలో హీరో చిరునే అయిన మరొక పాత్ర ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషిచింది అనుష్క మల్హోత్రా. . అదేనండి అక్షయ పాత్ర. ఈ సినిమాలో చిరు కూతురుగా డాడి అంటూ… తన చిలిపితనంతో అల్లరి చేష్టలతో ముద్దు ముద్దు మాటలతో అక్షయ ఈ సినిమాతో అందరిని ఆకట్టుకుంది. ఈ పాప అసలు పేరు అనుష్క మల్హోత్రా.సినిమాలో చిరంజీవి సిమ్రాన్ రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్స్ ఉన్నా కూడా ఆ చిన్నారి వలనే ఆ సినిమా హిట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు.పాప నటనకు ఫిదా అవ్వని వారంటూ ఎవరు లేరు.డాడీ సినిమా తర్వాత మేరె యార్ కి షాదీ హై అనే హిందీ సినిమాలో నటించి అందరి మన్ననలను పొందింది.అయితే ఆ తర్వాత సినిమాల వలన చదువు పోతుందని ఆమె తల్లిదండ్రులు పూర్తీగా చదువు మీద ఫోకస్ పెట్టెలా చేశారు.అందుకే ఆ తర్వాత ఏ సినిమాలలో కూడా నటించలేదు.అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అనుష్క మళ్ళీ సినిమాలలో నటించాలనుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

 

ఈ పాప ఇప్పుడు మోడలింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం మోడలింగ్ లో బిజీ గా ఉన్న అనుష్క సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు వచ్చింది కాబట్టి సినిమా ఆఫర్స్ తొందరగానే వచ్చాయి.ఇప్పుడు అనుష్కకు సినీ పరిశ్రమలో చాలా ఆఫర్లు వస్తున్నాయి. కన్నడ నుంచి మంచి అఫర్ వచ్చినట్టు సమాచారం. త్వరలో శాండల్ వుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయని అయితే ఆచీతూచీ సినిమా కథలను ఎన్నుకుంటుందని తెలుస్తుంది.త్వరలో ఒక మంచి సినిమా ద్వారా మన ముందుకు రావాలని కోరుకుందాం.ఎం,మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చైల్డ్ ఆర్టిస్ ఇప్పుడు హీరోయిన్ అవుతున్న అనుష్క మల్హోత్రా గురించి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.