దర్శకుడు కాబోతున్న తెలుగు కమెడియన్ సప్తగిరి..

330

తెలుగులో ఉన్న మంచి కమెడియన్స్ లలో సప్తగిరి ఒకడు.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ప్రేమకథాచిత్రం సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఈ తిరుపతి నటుడి దశ తిరిగింది. ఇతడి కామెడీ కల్ట్ హిట్ అయ్యింది. అదే ఊపులో కొన్ని పదుల సినిమాల్లో సప్తగిరిగి ఛాన్సులు దక్కాయి.ఆ తర్వాత సప్తగిరికి హీరో ఛాన్సులు కూడా వచ్చాయి.

Related image

హీరోలుగా మారిన చాలా మంది కమేడియన్ల వలె సప్తగిరి కూడా రెండు మూడు ప్రయత్నాలు చేశాడు.అయితే అవి పెద్ద హిట్ కాలేదు.హీరోగా సెటిల్ అవుదామనుకున్న ఇతని ఆశలు నిర్జీవం అయ్యాయి.ఇప్పుడు కమీడియాన్ గా హీరోగా ఛాన్స్ లు లేవు.ఇలాంటి పరిస్థితిలో ఈ హాస్యనటుడు దర్శకత్వం మీద కన్నేశాడని వార్తలు వస్తున్నాయి.

Image result for sapthagiri

దర్శకుడిగా మారి సినిమాను రూపొందించాలనే ప్రయత్నంలో ఉన్నాడట సప్తగిరి. సినీ పరిశ్రమలో ఇతడి కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానే మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దర్శకత్వ ప్రయత్నాలను చేస్తున్నట్టుగా ఉన్నాడు.త్వరలోనే ఒక సినిమాను డైరెక్ట్ చేస్తాడంట.కథ కూడా సిద్ధం చేసుకున్నాడంట.మరి సప్తగిరి దర్శకత్వ విభాగంలో సత్తా చాటతాడేమో చూడాలి.