నేను, పోసాని, కేఏ పాల్ బిగ్‌బాస్ షోకు వెళ్తే ఒక్కొక్కరితో ఆడుకుంటాం… పృధ్విరాజ్

505

టాలీవుడ్ లో కూడా బిగ్ బాస్ ఫీవర్ నడుస్తుంది.ఈ షో కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చడం లేదు.బిగ్‌బాస్ షో మీద కమెడియన్ పృధ్వి సంచలన కామెంట్స్ చేశారు. ఆ షో వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని ఆయన వ్యాఖ్యానించారు.బిగ్‌బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం? అందరినీ ఒక గదిలో పెట్టారు. ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద ఊర్లో ఒక పెళ్లి.పెళ్లికి అందరూ రావడం, అందరూ పడుకుని ఉండటం, వీడి మ్యారేజ్ అయిపోయినా వీడికి సంబంధించిన లవర్స్ ఉంటారు. ఆ అమ్మాయిని చేసుకోవడానికి అంతకు ముందు ఎవడో పెళ్లి కొడుకు వచ్చి ఉంటాడు. వాడు దూరం నుండి జాలితో చూస్తుంటాడు.

ఏ అర్ధరాత్రో వెళ్లి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు.ఈ షో వల్ల ఎవరికి ఉపయోగం? జనాలను పిచ్చోళ్లను చేయడం తప్ప.వాడొచ్చి దీన్ని గిల్లాడు, వీడొచ్చి దాన్ని కదిలించాడు బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు రండీ! వేరే పని పాటలు లేవు వీళ్లకు. ఇదేనా ఈ షోలో చూపించేది? నాకు వెళ్లే అవకాశం వస్తే లోపలికి వెళ్లి అందరినీ కడిగేస్తా. అందులో ధర్మ పరిరక్షణార్థం ధర్మో రక్షతి రక్షిత: అని మాట్లాడే ఒకాయన ఉన్నారు.ఆయనను కడిగేస్తా ముందు.బిగ్‌బాస్ షోలో కరెక్ట్ మజా ఉండాలంటే పోసాని కృష్ణ మరళి రావాలి, పృధ్వీ రాజ్ రావాలి, డాక్టర్ కె.ఏ.పాల్ రావాలి. ఇలాంటి వాళ్లం ఉంటే మొత్తం కడిగి అవతల పారేసేవాళ్లం.

నిద్ర పోతున్నపుడు అందరూ ఒక చోటే అంట.నాకు నిద్రలో లేచే అలవాటుందయ్యా ఎవడి పక్కలో పడుకుంటానో తెలియదు, రేపు పొద్దున్న పెద్ద గొడవైందనుకోండి పృధ్వీరాజ్ తెలిసే ఒకావిడ పక్కలో పడుకున్నాడు అంటారు అందుకే నేను ఈ షోకు వెళ్లలేదు.గోకాలన్నపుడు గోకడం, పడుకోవాలన్నపుడు పడుకోవడం అలా ఉంటే మేము రెడీ అని పృధ్వి అన్నారు.