సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న కలర్స్ స్వాతి.. వరుడు ఎవరో తెలిస్తే షాక్

512

సినిమా తరాల పెళ్లి అంటే ఆ హడావిడి అంతా ఇంత కాదు.సినీ సెలెబ్రిటీలు రాజకీయ నాయకుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కల్యాణ మండపం నిండిపోతుంది.కానీ ఇవేమి లేకుండానే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంది.ఈ మధ్యనే హీరోయిన్ శ్రియ రహస్యంగా ఎవరికీ తెలియకుండా కనీసం మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసినదే.ఇప్పుడు ఇదే పంథాలో మరొక హీరోయిన్ పెళ్లి చేసుకుంది.మరి ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో చూద్దామా.

Image result for colors swathi marriage pics

‘కలర్స్’ కార్యక్రమంతో బుల్లితెర నుంచి వెండితెరపై మెరిసిన స్వాతి ఎలాంటి హడావిడీ లేకుండా తన మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. గురువారం రాత్రి (ఆగస్టు 30)న తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలెవరూ లేకుండానే స్వాతి పెళ్లి చేసుకోవడం గమనార్హం. గురువారం రాత్రి హైద‌రాబాద్‌లో ఆమె పెళ్లి చేసుకొంది.సాధార‌ణంగా సినిమా తార‌ల పెళ్లి అంటే ఓ రేంజ్ హంగామా ఉంటుంది. అదంతా ఉండొద్ద‌ని, పెళ్లి వేడుక కుటుంబ స‌భ్యుల సంబ‌రంగా ఉండాల‌నేది నా ఆలోచ‌న, అందుకే సింపుల్‌గా చేసుకుంటున్నాని క‌ల‌ర్స్ స్వాతి ఒక ప‌త్రిక‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

Image result for colors swathi marriage pics

 

కేరళకు చెందిన మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో స్వాతి కొంతకాలం ప్రేమలో ఉంది. ఎట్టకేలకు పెద్దలు అంగీకరించడంతో ఇద్దరూ వేదమంత్రాల మధ్య ఒక్కటయ్యారు. సెప్టెంబర్‌ 2న కొచ్చిలో స్వాతి, వికాస్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.డేంజ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై తెలుగులో ఎన్నో హిట్ సినిమల్లో న‌టించిన అచ్చ తెలుగు భామ‌ క‌ల‌ర్స్ స్వాతి. టీవీ యాంక‌ర్‌గా కెరియ‌ర్ మొద‌లుపెట్టి..త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనూ న‌టించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తాన‌ని చెపుతోంది.స్వాతి నటిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గానూ తన ప్రతిభ చాటింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో చక్కని నటనతో ఆకట్టుకుంది.తెలుగులో అయితే ఆమెకి చాలా కాలంగా ఆఫ‌ర్లురావ‌డం లేదు. కోలీవుడ్‌, మాలీవుడ్‌ల‌లో ఛాన్స్‌లు వస్తున్నాయి.అక్కడ రాణిస్తా అని అంటుంది స్వాతి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కలర్స్ స్వాతి గురించి ఆమె రహస్యంగా చేసుకున్న పెళ్లి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.