బిగ్ బాస్ హౌస్ లో కెప్లెన్ విష‌యంలో హాట్ బ్యూటీ కి రోల్ కు ఫైట్ సైలెంట్ అయిన రోల్ రైడా

421

బిగ్ బాస్ హౌస్ లో మళ్లీ పాత సంద‌డి మొదలైపోయింది… ఎలిమినేష‌న్లు నామినేష‌న్లు అంటూ ట‌ఫ్ టాస్క్ ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇళ్లంతా స‌త‌మ‌త‌మైంది.. ఇక కంటెస్టెంట్స్ కూడా వావ్ అనేలా వారికి స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు బిగ్ బాస్.. ఇక ఈ టాస్క్ లతో కాస్త ఇంట్లో స‌భ్యులు కూడా వివాదాలు వ‌చ్చాయి అయితే అన్నింటిని ప‌క్క‌న పెట్టి ఈరోజు మ‌రింత ఉల్లాసంగా హౌస్ ని చేశారు బిగ్ బాస్… ఇక కొత్త‌గా రీ ఎంట్రీ ఇచ్చిన నూత‌న నాయుడు శ్యామ‌లాని కూడా రోల్ గ‌ణేష్ ద్వారా ఇంట్లోకి స్పెష‌ల్ గిఫ్ట్అనే విధంగా పంపారు బిగ్ బాస్… వీరిద్ద‌రిని చూడ‌గానే ఇంటి స‌భ్యులు ఆనందంతో పొంగిపోయారు. గీతాకి దీప్తిని శ్యామ‌లాని చూడగానే ఎంతో ఆనందం వేసింది. ఇక రోల్ కూడా నాకు పెద్ద గిఫ్ట్ అనుకుంటే నువ్వు వ‌చ్చావు అక్కా అంటూ అత‌ను కూడా క‌న్నీరు పెట్టుకున్నాడు.

కంటెస్టెంట్స్‌‌ గురువారం ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా ఈ రోజు మ‌రింత ఉత్సాహంగా గ‌డిచింది అనే చెప్పాలి.ఇక బిగ్‌బాస్ హౌస్‌ కొత్త కెప్టెన్‌గా ఇటీవల వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన హాట్ బ్యూటీ పూజా రామచంద్రన్ ఎంపికైంది. ..హౌస్ కెప్టెన్సీ పోటీలో పూజా రామచంద్రన్, రోల్ రైడా, సామ్రాట్ పోటికి నిలిచారు… వీరికి బిగ్‌బాస్ డీజే టాస్క్‌ను ఇచ్చాడు. ముగ్గురు పోటీదారులు డీజే తరహాలో పాటలు ప్లే చేస్తుంటే.. వారికి ఎదురుగా ప్రత్యేకంగా అమర్చిన రింగ్‌‌లో కంటెస్టెంట్స్‌ తాము మద్దతిచ్చే వారి ముందు ఒక్కొక్కరు.. ఒక్కసారి మాత్రమే డ్యాన్స్ చేయాలని సూచించాడు.

రోల్‌ రైడాకి మద్దతుగా శ్యామల, అమిత్, గణేశ్ డ్యాన్స్ చేయగా.. సామ్రాట్‌కి మద్దతుగా బాబు గోగినేని, దీప్తి సునైన, నందిని, తనీశ్ రింగ్‌లో డ్యాన్స్ చేశారు. ఇక మిగిలిన పూజా‌కి మద్దతుగా.. గీతా మాధురి, దీప్తి, నూతన నాయుడు, కౌశల్ చేశారు. దీంతో.. సామ్రాట్, పూజాకి నలుగురేసి చొప్పున మద్దుతు రావడంతో పోటీ సమమైంది. ఈ దశలో కంటెస్టెంట్స్‌ అందరూ చర్చించుకుని.. ఒకరికి మద్దతు తెలుపుతూ డ్యాన్స్ చేయాలని సూచించగా.. పూజా రామచంద్రన్‌ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. దీంతో రోడ్ రైడా కాస్త డ‌ల్ అయ్యాడు.. అయితే ఇటు పూజా మాత్రం కెప్టెన్సీ రావ‌డం పై ఆనందం వ్య‌క్తం చేసింది. ఇక తొలివారం ఆమె రావ‌డం రెండో వారం ఆమె కెప్టెన్సీ ప‌ద‌వి పొంద‌డం పై ఆమె అభిమానులు కూడా ఆనందంలో సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ చేస్తున్నారు.. ఇక బిగ్ బాస్ హౌస్ లో విశ్వరూపం-2 ప్రమోషన్‌లో భాగంగా కమల్‌హాసన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించనున్నారు.. దీంతో బిగ్ బాస్ హౌస్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా నేటి షో ఉండ‌నుంది.