బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుకకు హాజరైన చిరంజీవి,రాజమౌళి,తెలంగాణా మంత్రులు..

497

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.తన సోదరుడి కుమార్తె అశ్రిత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు సాయి పవన్‌తో అంగరంగ వైభవంగా నిర్మాత బండ్ల గణేష్ జరిపించారు.హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వివాహా వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు.

Image result for bandla ganesh marriage

నూతన వధూవరులను ప్రముఖులు ఆశీర్వదించారు.సినీ పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులు, నిర్మాత సురేష్ బాబు, హస్యనటుడు బ్రహ్మానందం, హీరో శ్రీకాంత్ దంపతులు, హీరో గోపిచంద్, జయసుధ ఫ్యామిలీ సభ్యులు, వినాయక్, తదతరులు హాజరయ్యారు.

Producer Ganesh Brothers Daughter Ashritha Wedding

తెలంగాణ మంత్రులు డాక్టర్ రెడ్డి, ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్, జేసీ దివాకర్ రెడ్డి, ఎన్టీవీ అధినేత చౌదరీ, ఎంపీ కేశవరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.