కేరళ వరద బాదితులకు భారీ విరాళం ఇచ్చిన చియాన్ విక్రమ్..

437

కేరళ వరద భీభత్సం ప్రస్తుతం అందరిని కలచి వేస్తోంది. అన్ని చిత్ర పరిశ్రమల నుంచి నటీనటులంతా పెద్ద ఎత్తున కేరళ కోసం సాయం అందిస్తున్నారు. భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ ప్రజల కోసం పలువురు సినీ స్టార్లు తమ వంతు సహాయం అందించారు. కమల్ హాసన్, సూర్య, విజయ్ దేవరకొండ, కార్తి తదితరులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు.

Image result for allu arjun vijay devarakonda

హీరో విశాల్‌ ‘కేరళ రెస్క్యూ’ పేరుతో అత్యవసర వస్తువులను సేకరించి బాధితులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు.దీనిపై స్పందించిన కమల్ హాసన్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తమిళ స్టార్లు సూర్య, కార్తి కలిసి రూ. 25 లక్షలు ప్రకటించారు. తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వరద బాధితులకు తన వంతుగా రూ.25 లక్షలు దానం చేశారు.బాహుబలి హీరో ప్రభాస్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు

Chiyaan Vikram donates Rs 35 lakhs to CM relief fund

.ఆ జాబితాలో విక్రమ్ కూడా చేరాడు. భారీ మొత్తంలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సమయం అందించాడు. విక్రమ్ 35 లక్షల ఆర్థిక సాయాన్ని వరద బాధితుల కోసం అందించడం విశేషం. దుల్కర్ సల్మాన్, విజయ్, మెగాస్టార్ చిరంజీవి ఇలా చిత్ర పరిశ్రమలతో బేధం లేకుండా నటీనటులంతా కేరళ కోసం విరాళాలు అందిస్తున్నారు.