గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన చిరు..మరి చిరు చాలెంజ్‌ ఎవరికో తెలుసా..

433

తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన ‘గ్రీన్‌ ఛాలెంజ్’కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది.సోషల్ మీడియాలో కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు సెలెబ్రిటిలు మొక్కలు నాటుతున్నారు.బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

కేటీఆర్‌, కవిత, సచిన్‌, రాజమౌళి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి సవాల్‌ వేశారు.ఈ మద్యే ntv అధినేత నరేంద్ర చౌదరి మొక్కలు నాటి మెగాస్టార్ చిరంజీవికి సవాల్ విసిరాడు.ఇప్పుడు చిరంజీవి ఆయన సవాల్ ను స్వీకరించాడు.ఇంట్లో మూడు మొక్కలు నాటి కొందరిని నామినేట్‌ చేశారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తోపాటు, మీడియా మొఘల్‌ రామోజీరావు,ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు.మరి వీరు ఈ చాలెంజ్ ను ఎప్పుడు స్వీకరిస్తారో చూడాలి.