చిరు కొరటాల సినిమాలో ఇద్దరు హీరోయిన్స్.. ఎవరెవరో చూడండి

206

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ల గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

 ప్రీప్రొడక్షన్ పనులు

ఇందులో కొరటాల శివ మిల్కీ బ్యూటీ తమన్నా, నయనతార పేర్లని ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.కొరటాల చిత్రంలో తమన్నా నటించేది ఖరారైతే తొలిసారి మెగాస్టార్ సరసన రొమాన్స్ చేయబోతున్నట్లు అవుతుంది. తమన్నా సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నప్పటికీ తనది హీరోయిన్ పాత్ర కాదు.

Image result for chiranjeevi nayanathara tamanna

మరో హీరోయిన్ గా నయనతార పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార సైరా నరసింహారెడ్డి చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది. నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయన్ కనిపించబోతోంది. నయన్, చిరు జోడి బావుంటుందని భావిస్తున్న కొరటాల ఆమెని కూడా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.