మెగాస్టార్, కొరటాల సినిమాకు ముహూర్తం ఖరారు.

378

మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నాగానే మరొక సినిమాకు పచ్చజెండా ఊపాడు.

Image result for chiru koratala movie

మెగాస్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కొరటాల శివ తదుపరి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్త తెలియగానే సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొరటాల శివ చిరు కోసం ఓ సందేశాత్మక కథ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Image result for chiru koratala movie

కొరటాల, చిరు మూవీ సంక్రాంతి రోజు ప్రారంభం కానున్నట్లు తాజగా వార్తలు వస్తున్నాయి.సంక్రాంతికి సినిమాని లాంచ్ చేసి ఆ తరువాత మరికొన్ని రోజుల్లోనే సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లేలా కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కొరటాల శివ చిత్రాన్ని కూడా రాంచరణే నిర్మిస్తాడా లేక బయటవాళ్ళకు అవకావం ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది.