సైరా నా కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఎమోష‌న్ అయిన చిరంజీవి

237

సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అనేక‌మైన విష‌యాలు సైరా గురించి తెలియ‌చేశారు అనేది తెలిసిందే .. ఆ సినిమాలో చేసిన ప్ర‌తీ ఒక్క‌రి క‌ష్టం గురించి తెలియచేశారు. నేడు సైరా సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.. సైరాలో ప్ర‌తి ఒక్క‌రి పాత్ర చాలా అద్బుతంగా ఉంది అని ప్ర‌శంసిస్తున్నారు, ఆరోజు చిరంజీవి చెప్పిన విధంగా ప్ర‌తీ ఒక్కరూ బాగా న‌టించారు అని చెబుతున్నారు.

Image result for ram charan and chiru

మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, వైష్టవ్ తేజ్ పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా హాజరయ్యారు. ఈ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ పై చిరంజీవి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే ఇప్పుడు సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత అంద‌రూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఆరోజు చిరంజీవి చ‌ర‌ణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు అని ఈ సినిమా కోసం ఎన్నో దేశాలు తిరిగారు, అనేక‌మందితో క‌థ గురించి చ‌ర్చించారు.. అన్నింటిలో చ‌ర‌ణ్ భాగస్వామ్యం ఉందని అన్నారు, చివ‌ర‌కు చ‌ర‌ణ్ కు మంచి పేరు వ‌చ్చింది ఈ సినిమాతో.

ఈ క్రింద వీడియో చూడండి

తాజాగా చిరంజీవి కూడా ఇదే విష‌యాన్ని తెలియ‌చేశారు, ఈ సినిమా నాకు చర‌ణ్ ఓ గిఫ్ట్ గా ఇచ్చాడు అని అంటున్నారు …ఈ సినిమా బాగుంది అని ప్ర‌శంస‌లు నాకు చాలా వ‌స్తున్నాయి, అంద‌రూ చ‌ర‌ణ్ ను కూడా ప్ర‌శంసిస్తున్నారు, చ‌ర‌ణ్ నిర్మాణ విలువ‌ల గురించి చెబుతున్నారు నిర్మాత‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమా తీశారు అని అంటున్నారు, తాజాగా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. రెండు షోల‌కు సినిమా పై మంచి టాక్ అయితే వ‌చ్చింది, దీంతో చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక చ‌ర‌ణ్ కు తాను ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి కాని నాకే చ‌ర‌ణ్ మంచి గిఫ్ట్ రూపంలో ఈ సినిమా ఇచ్చారు అని ప్ర‌శంసించారు చిరంజీవి. ఈ విజ‌యంతో కుటుంబంలో అంద‌రూ సంతోషంలో ఉన్నారు, మెగా అభిమానుల‌కు ఈరోజు పండుగ అనే చెప్పాలి.