అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్న చిరంజీవి, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

834

అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే బాక్సాపీస్ ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ స‌ర‌స‌న ఇద్దరు హీరోయిన్లు న‌టించారు. అయితే విడులైన‌ ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తుంది.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

అయితే అల్లు శిరీష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్నారట. చిరంజీవి ఇంటికి ఎందుకు రమ్మంటున్నారో.. అది కూడా నన్ను మాత్రమే రమ్మంటున్నారు.. ఎందుకో అర్థం కాక అల్లు శిరీష్ భయంభయంగా ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్ళాడట. అయితే ఇంటికి వెళ్లిన అల్లు శిరీష్ కు , చిరూ అభినంద‌న‌లు తెలిపార‌ట‌. సినిమా బాగా చేశావ‌ని అత‌నికి కాంప్లిమెంట్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. సినిమా సూప‌ర్ గా ఉంద‌ని అల్లు శిరీష్ కు చెప్పిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.

Image result for allu sirish and mega star

ఇంటిని వెళ్లిన అల్లు శిరీస్ ను చిరంజీవి గట్టిగా హత్తుకుని బాగా చేశావ్ శిరీష్‌. నీ నటన చాలా బాగుంది. ఒక్క క్షణం సినిమా కథ కూడా చాలా బాగుంది. భావోద్వేగంతో నటించిన నీ నటన బాగా నచ్చిందంటూ ప్రశంసలతో ముంచెత్తారట చిరు. దీంతో శిరీష్‌ ఆనందానికి అవధుల్లేవట. నేరుగా వెంట‌నే త‌న ఇంటికి వెళ్ళిన అల్లు శిరీష్‌, తన తండ్రి అల్లు అరవింద్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడట.

Image result for allu sirish and mega star

చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి నన్ను మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడట. నా నాట‌న చాగా బాగుంద‌ని, సినిమాల్లోకి బాగా నటించావ‌ని చిరూ చెప్పిన విష‌యాల‌ను అల్లు అరవింద్ తో పంచుకున్నాడ‌ట అల్లు శిరీష్.. చిరూ అభినందించ‌డం వ‌ల్ల నాకు చాలా హ్యాపీకి ఉంద‌ని అన్నార‌ట అల్లు అర‌వింద్ తో.. అంతేకాకుండా ఈ విష‌యాన్ని అల్లు అర్జున్ తో కూడా పంచుకున్నాడ శిరీష్..

Image result for allu sirish and mega star
గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే అల్లు శిరీష్‌ సక్సెస్ సాధించగా అంతకు ముందు నటించిన గౌరవం సినిమా ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ హిట్ కోసం వెతుకుతూ చివరకు ఒక్క క్షణం సినిమాతో అల్లు శిరీష్‌ మరో విజయాన్ని సాధించుకున్నారు. చిరంజీవితో పాటు అన్న అల్లు అర్జున్ కూడా అల్లు శిరీష్‌ ను పొగడ్తలతో ముంచెత్తారట.

Image result for allu sirish and mega star

కాగా, ఈ సంద‌ర్బంగా నిహారిక‌తో పెళ్లి గురించి కూడా అల్లు శిరీష్ ను చిరూ అడిగిన‌ట్లు ఫిల్మ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిహారిక‌కు, అల్లు శిరీష్ తో పెళ్లి చేయాల‌ని మోగా ఫ్యామిలీ భావిస్తుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం నిహారిక కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. అయితే నిహారిక‌, అల్లు శిరీష్ ల పెళ్లి దాదాపుగా ఫిక్స్ అయింద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.