త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరంజీవి నెక్స్ట్ సినిమా… అనౌన్స్ చేసిన చిరంజీవి..

241

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా గురించే అనేక రకాలైన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నాడనే వార్త ఇటీవల హల్ చల్ చేసింది. కానీ అలాంటి వార్తలకు తెరదించుతూ తాను చేయబోయే సినిమా గురించి వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాంబు పేల్చాడు.

Related image

చిరంజీవి మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఓ సినిమా చేశాను. అది రాంచరణ్‌తో చేసిన బ్రూస్ లీ. ఆ సినిమాలో నాకు రీఎంట్రీ మాదిరిగా నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడే ఆయనతో సినిమా చేయాలని అనిపించింది. నేను ఏ ముహుర్తంలో అనుకొన్నానో తెలియదు గానీ.. త్వరలోనే ఆయనతో సినిమా చేయడానికి అవకాశం లభించింది.

Image result for chiranjeevi trivikram

రాంచరణ్‌కి ఇష్టమైన నిర్మాత డీవీవీ దానయ్య, పవన్ కల్యాణ్‌కు ఆప్తుడు, నాకు ఆత్మీయుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాను. ఇది సందర్భం కాకపోయినా నేను నా ఉత్సాహం ఆపుకోలేక చెప్పాల్సి వచ్చిందని చిరంజీవి చెప్పాడు. మొత్తానికి మెగాస్టార్ మాటల మాంత్రికుడు సినిమా ఇలా సెట్ అయ్యిందన్నమాట.