చిన బాబు మూవీ రివ్యూ…

9446

ఖాకీ’ లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీ తర్వాత కార్తి హీరోగా తెరకెక్కిన ‘కడైకుట్టి సింగం’ అనే తమిళ సినిమా తెలుగులో ‘చినబాబు’గా విడుదలైంది. చాలా కాలం తర్వాత కార్తి విలేజ్ డ్రామాతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ మూవీలో నటించారు.విలేజ్, ఫ్యామిలీ డ్రామాతో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్వయంగా కార్తి సోదరుడు సూర్య నిర్మించడం మరో విశేషం. సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించే అవకాశం ఉంది అనేది రివ్యూలో చూద్దాం…

 ఇదీ అసలు స్టోరీ

కథ..
పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్)ది జమీందారీ కుటుంబం. ఆయన మొదటి భార్య మాధవి (విజి చంద్రశేఖర్)కు ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం కోసం ఆమె చెల్లెలయిన భార్గవి (భానుప్రియ)ను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మాధవికి కొడుకు (కార్తి) జన్మిస్తాడు. ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడైన చినబాబు తండ్రిలాగే వ్యవసాయం చేస్తుంటాడు. అక్కల ఆప్యాయతల మధ్య పెరిగిన చినబాబు తన ఇద్దరు మేనకోడళ్లను కాదని మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. వేరే అమ్మాయితో పెళ్లికి అక్కలు, బావలను ఎలా ఒప్పించగలిగాడు..? కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన విబేధాలను ఎలా పరిష్కరించాడనేదే ఈ చిత్ర కథ.

 కార్తి పెర్ఫార్మెన్స్

అందరి ప్రదర్శన ;
రైతు పాత్రల్లో కార్తి పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లలో తనదైన శైలితో సూపర్ అనిపించాడు. ఇక ఫ్యామిలీలో గొడవలు వచ్చినపుడు అనుబంధాలు విడిపోకుండా, వారిని కలిపేందుకు కార్తి చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.సాయేషా సైల్ పరిమితమైన పాత్రలో నటించింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఫర్వాలేదిపించిది. విలేజ్ డ్రామా కాబట్టి ఆమెపై గ్లామరస్ సీన్లు కూడా ఏమీ లేవు.తండ్రి పాత్రలో సత్యరాజ్ తనదైన నటనటో ఆకట్టుకున్నారు. ప్రియభవాని, భానుప్రియ, విజి చంద్రశేఖర్, ఆర్తన బిను, సూరి తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.పల్లెటూరి వాతావరణంలో చినబాబును అందంగా తెరకెక్కించారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో సూర్య.. తన తమ్ముడికి మంచి హిట్ అందించారు. డబ్బింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. వేల్‌ రాజ్ పనితనం బాగుంది. రూబెన్ ఎడిటింగ్ వర్క్‌ను మెచ్చుకొని తీరాల్సిందే.

 సాయేషా సైగల్

ప్లస్ పాయింట్స్
కార్తి, సత్యరాజ్ పెర్ఫార్మెన్స్
రైతు గొప్పదనం గురించి చెప్పే ఎపిసోడ్
ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలు

మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో హెవీ డోస్ సెంటిమెంట్
ఫ్యామిలీ డ్రామాను మరీ సాగదీయడం

రేటింగ్ : 3/5