స్టార్ హీరో సుదీప్ పై చీటింగ్ కేసు

390

ఈగ సినిమాలో స‌మంత నాని కి ఎంత పేరు వ‌చ్చిందో అలాగే సుదీప్ కిచ్చ ఫేమ్ తెచ్చుకున్నారు… విల‌న్ గా ఆయ‌న న‌ట‌న శిఖ‌రానికి తీసుకు వెళ్లింది ఈ చిత్రంతో.. ఇక ఈ సినిమా త‌ర్వాత తెలుగులో బిజీ స్టార్ గా ఆయ‌న అవుతారు అని అభావించారు.. కాని ఆయ‌న క‌న్న‌డ‌లోనే న‌టిస్తూ టాలీవుడ్ కు దూరంగా నే ఉన్నారు.. బాహుబ‌లిలో కూడా చిన్న పాత్ర‌చేశారు ఆయ‌న‌.

Image result for sudeep hero

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరాలో ఆయ‌న న‌టిస్తున్నారు ఇందులో కీల‌క పాత్ర ఆయ‌న పోషిస్తున్నారు అని తెలుస్తోంది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ హీరోగా ఉ న్న ఆయ‌న పై తాజాగా ఓ చీటింగ్ కేసు న‌మోదు అయింది.. సుదీప్ త‌న‌ని మోసం చేశాడు అని కర్ణాటకలోని చిక్కమంగుళురు కు చెందిన కాఫీ రియల్ ఎస్టేట్ యజమాని దీపక్ మయూర్, కర్ణాటక ఫిలిం ఛాంబర్ లో పిర్యాదు చేయడం ఇప్ప‌డు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి అయ్యేలా చేసింది.

Image result for sudeep hero

ఈ చీటింగ్ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాలి అని కాఫీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి క‌న్న‌డ ఫిలిం ఛాంబ‌ర్ స‌భ్యుల‌ను కోరుతున్నారు.. అయితే దీని వెనుక ఆయ‌న చెబుతున్న చీటింగ్ స్టోరీ ఏమిటి అంటే.. గతంలో సుదీప్ నిర్మించిన ఓ టివి సీరియల్ షూటింగ్ కు అక్కడ పర్మిషన్ ఇచ్చారట..ఆ షూటింగ్ స‌మ‌యంలో కాఫీ తోటతో పాటు అక్కడున్న విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయి.. అగ్రిమెంట్ ప్ర‌కారం ఆన‌ష్టం త‌న‌కు సుదీప్ చెల్లించ‌లేదు అని ఆ వ్యాపారి ఫిర్యాదు చేశాడు.