చంద్రబాబు నాయుడు బయోపిక్ ‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ విడుదల.

322

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘చంద్రోదయం’. వెంకట రమణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి.జె రాజేంద్ర నిర్మాత. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో వినోద్ నువ్వుల నటిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే అచ్చం చంద్రబాబునుచూస్తున్నటే ఉంది.

Chandrodayam movie first look released

‘దేశచరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ ఆదర్శం.ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు,రాజకీయాలలోకి ఎలా వచ్చారు. టీడీపీ పార్టీలోకి ఎలా వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అనే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయట.

Chandrodayam movie first look released

షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబరు 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా వీటితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ సైతం వస్తుండటం చర్చనీయాంశం అయింది.చూడాలి మరి ఎవరి బయోపిక్ జనాలను ఆకట్టుకుంటుందో.