క‌ల్యాణ్ రామ్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు సంతోషంలో నంద‌మూరి అభిమానులు

509

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది…ఇప్పుడు తాజాగా 105 మంది అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిన టీ.ఆర్.ఎస్, త‌న‌కు తానుగా రాజ‌కీయ శంఖారావం పూరించింది.. ఇప్పుడు తెలంగాణ‌లో అంత‌బ‌లంగా ఉన్న పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే, కాంగ్రెస్ టీ.ఆర్.ఎస్ మాత్ర‌మే అని చెబుతారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు పోటికి రెడీ అయింది.. అన్నీ పార్టీల‌కు కేడ‌ర్ ఎలా ఉందో అలాగే తెలుగుదేశం పార్టీకి కేడ‌ర్ ఉంది కాని, నాయ‌క‌త్వలేమి ఇక్క‌డ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి మ‌ళ్లీ వ‌స్తారు అని వార్త‌లు వ‌చ్చాయి కాని ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్ లోనే కొన‌సాగుతారు అని అంటున్నారు.. ఇప్పుడు తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ కొత్త‌వారిని పోటికి నిల‌బెట్టాలి అని చూస్తోంది.

Image result for chandra babu and kalayan ram

ఇక ఎప్ప‌టి నుంచో తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో ఎటువంటి రాజ‌కీయం చేయ‌బోతోంది అని అంద‌రూ ఆలోచించారు.. ఇప్పుడు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నంద‌మూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్య‌కర్త‌లు తెలంగాణ‌లో తెలుగుదేశానికి ఓ దిశానిర్దేశం చేయాలి అని కోరుతున్నారు.ఇక హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ఆయ‌న కుమారులు ఇద్ద‌రూ ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో ప‌ద‌విని హ‌రికృష్ణ లేరు కాబ‌ట్టి జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలి అనే డిమాండ్ వ‌చ్చింది. కాని అనూహ్యాంగా మ‌రికొంద‌రు క‌ల్యాణ్ రామ్ పేరు తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రాను అని తెలియ‌చేస్తున్నారు.

Image result for chandra babu and kalayan ram

ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఓ కీలక నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.. క‌ల్యాణ్ రామ్ ని తెలంగాణ‌లో ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆయ‌న్ని కూక‌ట్ ప‌ల్లి లేదా శేర్ లింగం ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అడిగార‌ట తెలంగాణ త‌ర‌పున క‌ల్యాణ్ రామ్ కు ఎన్నిక‌ల్లో టికెట్ మొద‌టి అభ్య‌ర్దిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు అని అంటున్నారు. నంద‌మూరి అభిమానులు కూడా ఈ వార్త‌తో ఆనందంలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మాత్రం 2024 ఎన్నిక‌ల్లో యాక్టీవ్ అవుతారు అని అంటున్నారు. ఇప్పుడు పార్టీ త‌ర‌పున నాయ‌కులు తెలంగాణ‌లో లేరు అందుకే క‌ల్యాణ్ రామ్ కు టికెట్ కూడా ఇచ్చి పార్టీ బాధ్య‌త‌లు ఇస్తారు అని తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక నిర్మాత‌గా సినిమాహీరోగా వ్యాపారాల‌తో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్ పోటీకి ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.. చంద్ర‌బాబు టికెట్ ఇస్తాను అని చెప్ప‌డంతో ఇప్పుడు ఈ వార్త నంద‌మూరి కుటుంబంలోనే కాదు తెలుగుదేశం స‌ర్కిల్స్ లో కూడా వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు ఏమంటారు క‌ల్యాణ్ రామ్ అభ్య‌ర్దిత్వం పై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి.