వరుసగా రెండు సినిమాల్లో చై – సామ్‌

54

అక్కినేని కోడలు సమంత పెళ్లి తరువాత కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాతో నటిగా బిజీ అవుతున్నారు. ఇప్పటికే యు టర్న్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన సమంత, మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Image result for naga chaitanya samantha pics

త్వరలో నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో చై -సామ్‌ జంటగా నటించనున్నారు.ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ ఈ జంట కనువిందు చేయనుందట.

Related image

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాహుల్ రవీంద్రన్‌ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఉంటుందని ప్రకటించిన రాహుల్.. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.