నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న చై సామ్ పర్సనల్ వీడియో

626

దక్షిణాదిలో హాటెస్ట్ జంట అంటే సమంత, నాగచైతన్య జోడీయే గుర్తుకువస్తుంది.స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే కెరీర్ ఏమవుతుందో అనే భయం కూడా లేకుండా నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌ర్వాత కూడా హీరోయిన్‌గా త‌న జోరు కొనసాగిస్తోంది స‌మంత‌. ఈ ఏడాది స‌మంత న‌టించిన `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `అభిమ‌న్యుడు`’యూ టర్న్ ‘ సినిమాలు ఘ‌న‌విజ‌యాలు సాధించాయి.అలాగే అక్కినేని నాగచైతన్య కూడా ఈ ఏడాది స్వింగ్ లోనే ఉన్నాడు.అతను నటించిన శైలజ రెడ్డి అల్లుడు హిట్ అవ్వగా ఈరోజు విడుదల అయినా సవ్యసాచి మంచి టాక్ తెచ్చుకుంది. వీళ్లిద్దరికీ సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇప్పుడు వీళ్లిద్దరి పర్సనల్ వీడియో బయటకు వచ్చింది.మరి ఆ వీడియో సంగతేంటో చూద్దామా.

Image result for naga chaitanya samantha

అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు భార్యాభర్తలుగా మారిపోయారు.మారిపోవడం ఏమిటి నిజంగానే భార్యాభర్తలు కదా అనుకుంటున్నారా..నిజ జీవితంలో భార్యాభర్తలే ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలో కూడా భార్యాభర్తలే. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారన్నా సంగతి మన అందరికి తెలిసిందే.’నిన్నుకోరి’ ఫేం శివ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు, హరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పేరు అధికారికంగా వెల్లడించలేదు.కానీ ఈ చిత్రానికి “మజిలి” అనే టైటిల్‌ పెడుతున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క చిన్న విషయం కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు.అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చైతన్య కుర్చీలో కూర్చుని ఉండగా సమంత పక్కనే ఉండి ఏదో మాట్లాడుకుంటున్న 35 సెకన్ల వీడియోను సమంతకు ఆమె అభిమాని షేర్‌ చేశారు.ఈ వీడియోలో చై సామ్ ఇద్దరు ఏదో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు.సమంత ఏదో చెప్తే చైతన్య విననట్టు ఉన్నాడు.అందుకే సమంత క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి చిన్న స్మైల్ ఇచ్చింది. ఈ వీడియోపై చూసిన సమంత షాక్‌ అయింది. అవాక్‌ అయిన ఎమోజీలను పోస్ట్ చేశారు.ఆ తర్వాత ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.వీడియో మాత్రం అక్కినేని అభిమానులను ఆనందపరుస్తుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.లీక్ అయినా ఈ వీడియో గురించి అలాగే చై సామ్ జంట గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.