‘96’ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ అవకాశం

158

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ తమిళనాట రికార్డులు సృష్టించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శర్వానంద్ – సమంతాలు హీరో హీరోయిన్లుగా తెలుగులో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Image result for 96 movie

ఈ సినిమాలో శర్వానంద్ టీనేజ్ అబ్బాయిగా కూడా కనిపించాల్సి ఉంది. ఈ పాత్ర కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు. “యంగ్ శర్వానంద్ కావాలి .. ఈ పాత్రను పోషించడానికి ఆసక్తి ఉండే 14 నుండి 20 ఏళ్ళ మధ్యలో ఉన్నవారు మీ వివరాలను 10 ఫోటోలతో svc034gmail.com కు పంపండి.

96 మూవీలో స్కూల్‌ ఏజ్‌లో ఉండే లవ్‌ స్టోరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. తమిళ్‌లో ఆ పాత్రలు చేసినవారికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ కథను తెలుగులో స్కూల్‌ లేదా కాలేజ్‌కు మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మరి నటనలో ఆసక్తి ఉన్న వారు ఆలస్యం చేయకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకోండి.