తొలిసినిమా కావడంతో అడిగిన‌వారికి ఇచ్చేశా కాదనలేకపోయా..

1401

అదర గొట్టే గ్లామర్ తో వన్స్ మోర్ అనిపించుకోవడానికి ఐరా మోర్ వచ్చేస్తోంది. ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మ డిస్కవరీ… రాము సినిమాల్లో హీరోయిన్లు హాట్ గా ఉంటారన్నది తెలిసిందే. అదే కోవలో ఐరా మోర్ ని కూడా రాము సేర్చింగ్ చేసి మరీ తన సొంత చింత్రంలో హీరోయిన్ గా పెట్టారు. ఆయన నిర్మాతగా వస్తున్న చిత్రం భైరవ గీత. ఇందులో హాట్ హాట్ అందాలతో ఐరా మోర్ యూత్ ని కిర్రాక్ పెడుతుందని అంటున్నారు. ఐరా మోర్ సెలక్షన్ పూర్తిగా రాముదే కావడంతో ఆమె అందం అభినయం పట్ల ఫుల్ కాంఫిడెన్స్ తో ఉండొచ్చు.

Related image

మీటూ ఇబ్బందులు తనకు లేవు అంటోంది ఈ ముద్దు గుమ్మ. రాము ముక్కు సూటి మనిషి. తన మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు బాగా నచింది. ఇక భయం అన్నది నాకు పూర్తిగా పోగొట్టి ఫస్ట్ మూవీలోనే ది బెస్ట్ అన్నట్లుగా చేయించుకున్నారని ఐరా మోర్ చేబుతోంది. తాను రంగ స్థల నటినని, సినిమాకు, ధియేటర్ ఆర్ట్స్ కు చాలా తేడా ఉందని మోర్ అంటోంది. తనకు ఈ చాన్స్ రావడం చాలా లక్ అని కూడా చెప్తోంది.

నాది థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌. నాన్న న్యాయవాది, అమ్మ ప్రొఫెసర్‌. ఇంట్లో అంతా చదువుకున్న వారు కావడంతో నాకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించారు. ఈ చిత్ర ఆడిషన్‌లో ఎంపికయ్యాను. ఈ చిత్రంలో లండన్‌లో చదువుకున్న గీత పాత్రలో నటించాను. కుల వ్యవస్థ, బానిసత్వం అంటే అస్సలు నచ్చవు. కానీ మా ఇంట్లోనే మనుషుల మధ్య అంతరాలు కనిపిస్తాయి. వాటిని చూసి ఏం చేశాననేది ఆసక్తికరం. యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. చాలా సన్నివేశాల్లో పరుగెత్తాల్సి వచ్చింది. నేను కంఫర్ట్‌గా లేనప్పటికీ తొలి సినిమా కావడంతో కొన్ని ముద్దు సన్నివేశాల్లో కాదనలేక నటించా. ఇందులో నా పాత్రకు మంచి పేరొస్తుంది. తెలుగులో తొలి సినిమా చేయడం మరచిపోలేని అనుభూతి. ఇది నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఓ పాత్రని చేయడానికి నేను వందసార్లు ఆలోచిస్తా. మంచి పాత్ర వచ్చినప్పుడు అది చిన్నదా, పెద్దదా అని కూడా ఆలోచించను. ‘మీటూ’ విషయాల గురించి అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం మంచిదే. మనం చేసే వాతావరణం బాగుండాలి. తెలుగులో రవితేజ, మహేష్‌ నటించిన సినిమాలు చూశా. అనుష్క అంటే ఇష్టం’ అని కథానాయిక ఐరా మోర్‌ చెప్పారు. మ‌రి ఆమె వ్యాఖ్య‌ల‌పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.