భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తున్న కేరాఫ్ కంచరపాలెం

341

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దక్కించుకున్న సినిమాలలో కంచరపాలెం ఒకటి.ఒక ఊరు నేపథ్యంలో సాగే కథను దర్శకుడు చాలా అద్భుతంగా తీశాడు.అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన చిత్రమిది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రానా దగ్గుబాటి సినిమాను సమర్పించారు. వైజాగ్‌ సమీపంలోని కంచరపాలెం నేపథ్యంలో సాగే కథ ఇది. అందరూ నూతన నటీనటులే. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాత. స్వీకర్‌ అగస్థి సంగీతం అందించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image result for c/o kancharapalem

ఈ సినిమా అమెరికాలో చక్కటి వసూళ్లు రాబడుతోంది.ఈ చిత్రం అమెరికాలో మూడు రోజుల్లో రూ.1.32 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది.సినిమా శుక్రవారం 53,835 డాలర్లు, శనివారం 82,709 డాలర్లు, ఆదివారం 45,963 డాలర్లు మొత్తం 182,507 డాలర్లు అంటే రూ.1.32 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.

Image result for c/o kancharapalem

ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసించారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, క్రిష్‌, మహేశ్‌బాబు, సుకుమార్‌, నాని, సమంత, రాశీఖన్నా తదితరులు యూనిట్‌ను మెచ్చుకున్నారు. సినిమాను తప్పక చూడండని ప్రేక్షకులను కోరారు.