బిగ్ బాస్’బూతు షో.. నిలిపివేయండి : హైకోర్టులో పిల్

196

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 రెడీ అయ్యింది. ఇంకొక వారంలో ఇది మీ ముందుకు వస్తుంది. హీరో నాగార్జున ఈ షోను హోస్ట్ చేయనున్నాడు. పార్టిసిపెంట్స్ గా 14 మంది సెలెక్ట్ అయ్యారు. కొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. యాంకర్ శ్రీముఖి, న్యూస్ హోస్ట్ తీన్మార్ సావిత్రి, టీవీ9 జాఫర్, నటి హేమ, హిమజ, సింగర్ రాహుల్ సిల్పి గంజ్, నటుడు రవికృష్ణ.. ఇలా కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇంకొక వారం రోజులే ఉండడంతో ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Image result for bigg boss 3 telugu

తాజాగా ఈ రాయిల్టీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన పిల్ దాఖలైంది. తెలుగు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిల్ వేశారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌లో నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేర్చడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోపై నీలి నీడలు కమ్ముకన్నట్లయింది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. సినిమాలకు ఎలా సెన్సార్ చేస్తారో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ఈ బిగ్ బాస్ గేమ్ షో కూడా సెన్సార్ చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోర్టును కోరారు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ibf)చట్టాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని తన వాజ్యంలో పేర్కొన్నారు. సెలెక్షన్స్ నేపథ్యంలో మహిళలను కమిట్మెంట్ పేరుతో మానసిక ఒత్తిడి‌కి గురిచేస్తున్న నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి కోర్టును కోరారు. గాయిత్రి గుప్తా, శ్వేతా రెడ్డి ఫిర్యాదులను ఈ సందర్భంగా కేతిరెడ్డి ప్రస్తావించారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఈ కేసులో మొత్తం ప్రతివాదులుగా 10 మందిని చేర్చారు. నటుడు నాగార్జున తో పాటు స్టార్ మా, ఐబిఎఫ్, ఎండిమాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోమ్ సెక్రెటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిటీ పోలీస్ కమిషనర్ ఉన్నారు. ఈ పిల్ ను ప్రధాన నాయమూర్తి లంచ్ మోషన్ సమయంలో వినుటకు సిద్ధం అయ్యారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కేసును కేతిరెడ్డి తరుపున శాంతి భూషణ్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. అక్కినేని నాగార్జున అన్నమయ్య , భక్త రామదాసు, షిర్డీసాయి వంటి చిత్రాలలో నటించి ఇలాంటి షో లకు హోస్ట్‌గా ఉండడంపై కేతిరెడ్డి విమర్శలు చేశారు. షోను నిషేదించడానికి వీలుకానిచో, యువతను, పిల్లలను పెడదారి పట్టించే విధంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేస్తే బావుంటుందని కేతిరెడ్డి తెలిపారు. సినిమా మాదిరిగా ప్రతి ఎపిసోడ్ సెన్సార్ చేశాకే టీవీలో ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ‘బిగ్ బాస్’ బూతు షో మాదిరిగా తయారైందని, దీని ప్రభావం జనాల మీద చాలా ఉంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా చేసిన ఫిర్యాదుపై బిగ్ బాస్ కోఆర్డినేషన్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసింది. మరోవైపు, తమపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ బిగ్ బాస్ షో యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.