BreakingNews : ప్రముఖ హాస్యనటుడు ,మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి.. షాక్ లో సినిప్రముఖులు

500

ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. సినీ ప్రముఖుల ఇళ్లలో అలాగే రాజకీయ ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల వలన కొందరు, అనారోగ్యం వలన కొందరు చనిపోతే కొందరు ఏమో వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా ఇలా దుర్మరణం చెందుతున్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ చనిపోయారు. మరి ఆయనెవరో ఎలా చనిపోయారో తెలుసుకుందాం.

ఆయన పేరు రాకెట్ రామనాథం. ఎవరి కంఠాన్ని అయినా ఇట్టే ఇమిటేట్ చేయగలడు. అదే ఆయన్ని ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ని చేసింది. తమిళనాడు తొలి మిమిక్రి ఆర్టిస్ట్ ఆయనే. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హాస్యనటుడుగా కెరీర్ మొదలెట్టారు. 1982లో స్పరిశం సినిమా ద్వారా కమెడియన్‌గా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రామనాథన్.ఒరు పుల్లాంకుళల్‌ అడుప్పు ఊదుదు, వలత్తకడా, మన్‌సోరు, నామ్‌, వరం వంటి ఎన్నో సినిమాల్లో చేసారు. ఆయన చేసిన కొన్ని సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి ఇక్కడ ఆడాయి. ఆయనను కలైమణి అవార్డ్, కలైసెల్వం అవార్డులతో తమిళనాడు గవర్నమెంట్, నడిగర్ సంఘం సత్కరించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ రామనాథం (74) హాస్పిటల్‌లోనే కన్నుమూశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. ఆయన మృతి తమిళ పరిశ్రమకు తీరని లోటే ..అవునా కాదా అన్నది ప్రక్కన పెడితే ఓ గొప్ప కళాకారుడు మృతి మాత్రం కళా ప్రపంచానికి గొప్ప విషాదం అనే చెప్పకోవాలి. ఆయన మృతికి మిమిక్రి ఆర్టిస్ట్ సంఘం నివాళులు అర్పించింది. మనం కూడా కామెంట్ రూపంలో ఆయన మృతికి నివాళి అర్పిద్దాం.