Breaking News : షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన స్టార్ హీరోయిన్…పరిస్థితి విషమం..

379

మనకి నిత్యం కనిపించే రంగాలలో సిని రంగం కూడా ఒకటి అయితే అందులో కనిపించే ప్రతి ఒక్కరికి మానవాళితో ఎంతో కొంత సంబంధం ఉంటుంది.వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ నటులు స్తంట్స్ చెయ్యడం లేదా సీన్ కోసం కష్టతరమైన జంపింగ్స్ చెయ్యడం లాంటివి చేస్తూ ఉంటారు.పెద్ద పెద్ద హీరోలు కూడా ప్రాణాలను లెక్కచెయ్యకుండా స్తంట్స్ చేస్తూ ఉంటారు. సీన్ మంచిగా రావడం కోసం అలా చేస్తుంటారు.అయితే అలా చేసే సమయంలో వాళ్ళకు పెద్ద పెద్ద గాయాలు కూడా అవుతుంటాయి.అలా చేసి ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ గాయాలపాలు అయ్యింది.మరి ఆ నటి ఎవరో ఏమైందో తెలుసుకుందామా.

Image result for సాయి ధన్షిక

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కబాలి’ సినిమాలో ఆయన కూతురిగా కనిపించిన సాయి ధన్షిక గుర్తుందా? ప్రస్తుతం ఆమె తమిళనాట స్టార్ నటిగా రాణిస్తోంది. చాలా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె జట్‌పాట్మా సినిమాస్ బ్యానర్‌పై అరుణ్‌గిరి, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘యోగి డా’ సినిమాలో నటిస్తుంది.. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కబీర్ సింగ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌లో గాయపడింది. ఆ చిత్రం కోసం ఆమె డూప్‌ లేకుండా పలు రిస్కీ సన్నివేశాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా ఇటీవల కోయంబత్తూర్‌లో బార్‌ సెట్ వేసి అందులో ఫైట్ సీన్‌ను తెరకెక్కించారు. చిత్రీకరణలో భాగంగా బార్‌లో కొంతమంది రౌడీలు ఆమెపై బీర్‌ బాటిళ్లు విసిరే సన్నివేశం తెరకెక్కిస్తుండగా, దురదృష్టవశాత్తూ ఒక బాటిల్ ధన్షిక ముఖానికి తగిలింది. దీంతో పగిలిన బాటిల్‌ ముక్క ఒకటి ఆమె కంటి కింద గుచ్చుకుంది. రక్తస్రావం కావడంతో చిత్ర యూనిట్ వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. అయితే అదే రోజు ధన్షిక మళ్లీ షూటింగ్‌లో పాల్గొని ఫైట్ సీన్ పూర్తిచేశారని, గాయమైనా పట్టించుకోకుండా షూటింగ్ ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో ఆమె చిత్రీకరణలో పాల్గొన్నారని యూనిట్‌ సభ్యులు తెలిపారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హీరోయిన్ సాయి ధన్షి గురించి అలాగే ఆమెకు జరిగిన ఈ ప్రమాదం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.