రాశి ఇంటిపై ఐటి సోదాలు..మొత్తం ఎంత ఆస్థి బయటపడిందో తెలిస్తే షాక్..

1933

సెలెబ్రిటీల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ విభాగం అధికారులు దాడులు జరిపితే అది మీడియాలో ప్రధానాంశంగా మారుతుంది.అందులో వాళ్ళు తప్పు చేయకున్నా సరే ఏదో ఒక చిన్న పాయింట్ ను ఆధారంగా చేసుకుని ఐటీ దాడులు జరుపుతారు.మనం అంటే గిట్టని వాళ్ళు ఏ చిన్న ఇంఫార్మేషన్ ఇచ్చినా కూడా రైడ్ చెయ్యడానికి సిద్దపడిపోతుంటారు. అలాంటి సంచలన ఘటనే హీరోయిన్ రాశి విషయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి దాని గురించి తెలుసుకుందామా.

Related image

నటి రాశి ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయాని తాజా సమాచారం. నటి రాశి ఇంటితో పాటు ఆమె సోదరుడు ‘కలర్స్’ సంస్థ అధినేత విజయ్ కృష్ణ ఇల్లు-కార్యాలయాల పైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. హైదరాబాద్ కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రై.లి కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారట. ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 40 లొకేషన్లలో ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఉన్న కలర్స్ ఆఫీసుల్లో సోదాలు చేయడం ఇప్పుడు సంచలనమైంది. అయితే ఆర్థిక వ్యవహారాలు పన్ను చెల్లింపుల్లో తేడా రావడంతోటే ఐటీ సోదాలు నిర్వహించినట్లు అధికారుల తెలిపారట. కలర్స్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లను రకరకాల బిల్లుల్ని ఐటీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారని లేటెస్ట్ న్యూస్. బ్యూటీ, ఫిట్ నెస్, వెయిట్ లాస్ తదితర రంగాల్లో కలర్స్ సంస్థ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. నటి రాశీ సోదరుడు దేవుల విజయ్ కృష్ణ ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. విజయ్ కృష్ణ తో పాటు భాగస్వామిగా ఉన్న రాయుడుపైనా అలాగే రాశీ ఇంటిపైనా ఐటీ దాడులు నిర్వహించారని తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే ఆదాయం విషయంలో తప్పుడు లెక్కలు చెప్పడంతోనే ఈ సోదాలు నిర్వహించామని ఓ ఐటీ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కంపెనీ మెషినరీతో పాటుగా డాక్యుమెంట్లను సీజ్ చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో కలర్స్ కు సంబంధించిన 49 బ్రాంచీలు.. 1500 మంది డైటీషియన్లు- థెరపిస్టులు కలర్స్ లో పని చేస్తున్నారు. దాదాపు 10లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. కోట్లలో వీరి లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. మొత్తం 10 కోట్ల వరకు లావాదేవీల విషయంలో డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీపై విశాఖపట్నం- విజయవాడ వంటి చోట్ల పలు ఆరోపణలు రావడం కోర్టుల పరిధికి వెళ్లడం అటుపై కంపెనీకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావడం వంటి వ్యవహారాల గురించి తెలిసినదే. రాశీ- రంభ వంటి తారలతో చేసిన వాణిజ్య ప్రకటనలు తప్పు దారి పట్టిస్తున్నాయని విజయవాడకు చెందిన ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో కలర్స్ సంచలనమైంది. ఈ ఆరోపణలతో రాశీ-రంభ హైలెట్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రాశి ఇంటిపై ఐటి సోదాలు జరిగాయి.. మరి రాశి ఇంటిపై జరిగిన ఐటి దాడుల ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి