breakingnews : బిగ్ బాస్ హౌస్ లో నటి సూసైడ్

50

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్. అటు తమిళంతో పాటు.. ఇటు తెలుగులోనూ ప్రసారమవుతోంది. పైగా, ఇది బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ రియాల్టీ షోకు తమిళంలో హోస్ట్‌గా విశ్వనటుడు కమల్ హాసన్ వ్యవహరిస్తుంటే తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఉన్నారు. సంచలనాలకు మారుపేరుగా మారిన బిగ్ బాస్ కార్యక్రమం మరో సంచలనాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటమే ఆ సంచలనం. అయితే తెలుగు బిగ్ బాస్ లో కాదు తమిళ బిగ్ బాస్ లో.

ఈ క్రింద వీడియో చూడండి

తమిళ బిగ్ బాస్ ప్రారంభం నుంచీ వివాదాలతో అట్టుడుకుతోంది. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్ బాస్ వివాదాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిపోయింది. ఇంటా, బయటా ఆ షో కు తమిళనాట పలు చిక్కులు వరుసగా ఎదురవుతూనే ఉన్నాయి. తమిళ్ లో నిర్వహిస్తున్న బిగ్ బాస్ – 3 కార్యక్రమం తెలుగు కంటే 30 రోజుల ముందే ప్రారంభమైంది. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ ఈ బిగ్ బాస్ – 3 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ – 3 కార్యక్రమంలో తమిళ హాస్యనటి మధుమిత పాల్గొన్నారు. తమిళ చిత్రం ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో మధుమిత పోషించిన హాస్య పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో గడిచిన 50 రోజులుగా మధుమిత చలాకీగా ఉన్నారు. ఇటీవలే హౌస్ కెప్టెన్ గా నియమితులయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్యాయత్నం...

అయితే శనివారం అనుకోకుండా ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. హౌస్ లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ గా మారిన తర్వాత హౌస్ లో ఉన్న సహచరుల నుంచి తనకు సహకారం అందకపోగా వారి నుంచి ఎదురైన అవమానాలు తట్టుకోలేక పోయానని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని మధుమిత చెప్పారు. అయితే హోస్ట్ కమల్ హాసన్ మధుమిత చేసిన చర్యపై మండిపడ్డారు. హౌస్ లో మధుమిత బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిందని అన్నారు. మొత్తానికి తమిళ బిగ్ బాస్ మూడు సీజన్లూ వివాదాస్పదంగా మారడం విశేషం. మరి బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్య చేసుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.