బ్రేకింగ్: సినీ పరిశ్రమలో ఘోర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

446

సినీ పరిశ్రమలో ఈ మధ్య విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది ప్రముఖులు చనిపోయారు.హరికృష్ణ మరణం అటు తెలుగు సినిమాకు గానీ రాజకీయ రంగానికి తీరని లోటు అని చెప్పుకోవాలి.అలాగే బి.జయ చనిపోయారు.ఇప్పుడు మరొక సీనియర్ నటుడు చనిపోయాడు.మరి ఆయన ఎవరు ఎలా చనిపోయాడా తెలుసుకుందామా.తమిళ సీనియర్‌ హాస్య నటుడు,సీనియ‌ర్ మిమిక్రి న‌టుడుగా ప్రాచుర్యం పొందిన రాకెట్‌ రామనాథన్‌ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి బుధవారం సాయంత్రం కృష్ణాపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.

Image result for రాకెట్‌ రామనాథన్‌

స్టేజ్‌ ఆర్టిస్టుగా, మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందిన రామనాథన్‌.. అనంతరకాలంలో సినీరంగంలోకి ప్రవేశించారు. ‘ఒరు పుల్లాంగుడళ్‌’, ‘అడుప్పు ఉరిగరది’, ‘స్పరిశం’, ‘వళత్తకడ’, ‘మన్‌సోరు’, ‘కోవిల్‌యానై’, ‘నాం’, ‘వరం’ తదితర సినిమాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు, ప‌లు అవార్డు అందుకున్నారు.శివాజీగణేశన్‌, ఎంజీఆర్‌, రజనీ, కమల్‌ తదితర నటుల స్వరంతో మిమిక్రీలు కూడా చేశారు. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ అవార్డు అందుకున్నారు.నడిగర్‌ సంఘం నుంచి ‘కలచ్ఛసెల్వం’ వంటి బిరుదలెన్నింటినో స్వీకరించారు. చివరిగా ఆయన నటించిన చిత్రం ‘నందా’. స్థానిక రాయపేటలో కుటుంబంతో నివశిస్తున్న రామనాథన్‌.. గత కొన్నేళ్లు వృద్ధాప్యంతో వచ్చిన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయనకు భార్య భానుమతి, కుమార్తె సాయిబాలా, కుమారుడు బాలాజీ వున్నారు.ఆయ‌న మృతికి త‌మిళ ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. ఆర్సీ శ‌క్తి అనే ద‌ర్శ‌కుడు రామ‌నాథ‌న్‌ని స్ప‌రిసం అనే చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ కాంత్ న‌టించిన మ‌న‌క‌న‌క్కు చిత్రంలోను రామ‌నాథ‌న్ న‌టించారు. యాంటీ హిందీ వివాదంలో పాల్గొన్న రామ‌నాథ‌న్ 1970 స‌మ‌యంలో జైలుకి కూడా వెళ్ళారు.ఈయన పూర్వీకులు తెలుగువారే.తెలుగు రాష్టాలలో కూడా ఈయనకు బంధుమిత్రులు ఉన్నారు.ఇతను తెలుగులో కొన్ని కొన్ని మిమిక్రి షో లు చేశాడు.మిమిక్రీలో ఒక మహాశిఖరాన్ని కోల్పోయాం అని తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు అంటున్నారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు.మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.