Breaking News : యాక్సిడెంట్ లో ఇద్దరు ప్రముఖ సీరియల్ నటులు మృతి..శోకసంద్రంలో ఇండస్ట్రీ

751

సినీ పరిశ్రమలో ఈ మధ్య విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది ప్రముఖులు చనిపోయారు.రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు. ఆ మధ్య కన్నడ హీరో దేవ్ రాజ్ కు కూడా యాక్సిడెంట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో మరొక చేదు ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సీరియల్స్ నటులు ఒకేసారి చనిపోవడం జరిగింది.

Related image

దైవ దర్శానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ నటి, నటుడు మృతి చెందారు. ‘మహానది’, ‘త్రివేణి సంగమ’, ‘మధుబాల’ లాంటి కన్నడ సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించిన రచన (23), జీవన్ (25) లు రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. మహానది సీరియల్ లో నటించిన కార్తిక్ అనే సహ నటుడి పుట్టినరోజును పురస్కరించుకుని, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్, జీవన్, రచనలు బెంగుళూరు- బందాడ్కకా రోడ్డులోని సుబ్రమణ్య గ్రామంలోని పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంలోని కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా పూజలు నిర్వహించి, వేడుక చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున అక్కడ నుంచి సఫారీలో బెంగళూరుకు తిరిగి ప్రయాణమయ్యారు. సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారిపై వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను ఢీకొట్టింది. అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందగా, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్ తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని గమనించిన వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.వారి మరణవార్త తెలిసి కన్నడ బుల్లితెరనే కాకుండా వెండితెర నటులు కూడా బాధపడుతున్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం