Breaking News:టాలీవుడ్ లో మరో ఘోర విషాదం

1267

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు హఠత్మరణం చెందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఓ వైపు యువ నటులు ఆత్మహత్యలు మరో వైపు సీనియర్ నటులు, దర్శక, నిర్మాతల మరణం చిత్ర పరిశ్రమని టెన్సన్ పెడుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు దీక్షితులు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ నిర్మాత, క్లాసిక్ చిత్రాల నిర్మాతగా పేరొందిన రాజ్ కుమార్ బార్జాత్య మృతి చెందారు.ఆ తర్వాత హీరొయిన్ సంఘమిత్ర రాయ్ ఛటర్జీ కన్నుమూశారు. వీరి మరణ వార్తలను మరవకముందే మరొక సినీ సెలెబ్రిటీ చనిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్దమాన నటుడిని పొట్టనబెట్టుకుంది. హైదరాబాద్‌ నుంచి తన సొంతూరుకి కారులో వెళ్తోన్న నటుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో టీవీ యాక్టర్ నన్నం సునీల్‌(24) మృతి చెందాడు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు షకీల్‌ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్‌ కొన్నేళ్లుగా షకీల్‌ వద్ద శిక్షణ పొందుతూ టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రముఖ ఛానెల్ లో వచ్చే పున్నాగ సీరియల్ లో ఇతను ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.

Image result for నన్నం సునీల్‌


షకీల్‌ తమ్ముడు సలావుద్దీన్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు ఆదివారం రాత్రి కారులో బయలుదేరాడు. దీంతో నటుడు సునీల్‌ కూడా తన స్వగ్రామానికి అతడితోపాటు వెళ్లాడు. రాచర్లపాడు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తోన్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సునీల్‌ అక్కడికక్కడే మృతిచెందగా సల్లావుద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సల్లావుద్దీన్‌ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.సునీల్ మృతికి పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.